English   

కేజీఎఫ్ 2 రిలీజ్ వాయిదా

KGF Chapter 2
2021-05-25 17:12:18

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన సినిమా కేజీఎఫ్.  ఈ సినిమాకు అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ చాప్టర్-2 కి కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా యష్ హీరోగా నటించారు. ఇక కేజీఎఫ్ విజయం తో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరగటంతో ఈ సినిమాలో బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నటీనటులను భాగం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. అంతే కాకుండా సినిమాను జులై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పట్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ లేదని అనిపిస్తోంది. దానికి కారణం ఇప్పట్లో కరోనా ఉధృతి తగ్గేలా లేకపోవడమే

ఒకవేళ జూన్ చివరినాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసినా 100 శాతం సీటింగ్ కు పర్మిషన్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్-2 భారీ బడ్జెట్ సినిమా అంతే కాకుండా భారీ అంచనాలు ఉన్న సినిమా కాబట్టి 50 శాతం సీటింగ్ లో రిలీజ్ చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి 100 శాతం సీటింగ్ కు పర్మిషన్ కు అనుమతులు వచ్చి పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డ తరవతే ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

More Related Stories