English   

కేజీఎఫ్​ 2 ఆడియో రైట్స్​కు రికార్డు ప్రైస్ 

KGF Chapter 2
2021-07-02 14:29:12

రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కేజిఎఫ్ చాప్టర్ 2'. ఇప్పటికే విడుదలైన 'కేజిఎఫ్ చాప్టర్ 1' ఎంత పెద్ద విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా రేంజ్ లో హీరోకు దర్శకుడికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదల కాకముందే దాంతో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో 'సలార్' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక 'కే జి ఎఫ్ చాప్టర్ 2' కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల విడుదల వాయిదా పడింది. 

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. 'కేజిఎఫ్ 2' సౌత్ ఆడియో రైట్స్ ను 'లహరి టి సిరీస్' సొంతం చేసుకున్నట్లు సీఈవో మనోహర్ నాయుడు తెలిపారు. 'కేజిఎఫ్ చాప్టర్ 1' పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో 'చాప్టర్ 2' రైట్స్ ని ఈ సంస్థ భారీ మొత్తం వెచ్చించి తీసుకున్నట్లు ఫిల్మీ దునియా లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కి నార్త్ లో కూడా మంచి పోటీ ఉండే అవకాశం ఉంది. దానికి కారణం మొదటి భాగానికి సంబంధించిన పాటలు హిందీలో కూడా అలరించడమే. మరి వీటిని ఏ సంస్థ చేజిక్కించుకుంధో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More Related Stories