English   

మహేష్ దూకుడు-2 పేరిట మోసం...80 లక్షలకి టోకరా 

Mahesh babu Dookudu 2
2019-08-13 10:39:40

సినిమా పేరిట మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినిమా పేరిట మోసపోతున్నా అది వేలల్లో మాత్రమే ఉండేది. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటనలో ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడు ఒక సినిమా మీద ఆసక్తి ఉన్న వ్యక్తి. సినిమా మాసాల్లోకెల్లా ఖరీదైన మోసం అని చర్చ జరుగుతున్న ఈ ఘటన పూర్వా పరాలు పరిశీలిస్తే, హైదరాబాద్ బౌరంపేటకు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్‌ సిరిమల్లె వెంకటేశ్వర్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. అయితే ఆ వ్యాపారంలో బాగా నష్టాలు రావడం అప్పుల పాలయ్యాడు. దీంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 71లో సరిమల్లె ప్రొడక్షన్స్‌ పేరిట ఒక ప్రొడక్షన్ ఆఫీస్ తెరిచాడు. ఆ ఆఫీస్ కార్పొరేట్ లుక్ లో ఒక బడా నిర్మాత ఆఫీసుకు ఎక్కగా తగ్గకుండా ఉండేలా యా ఆఫీస్ ని మెయిటెయిన్ చేస్తున్నాడు. అక్కడితో ఆగక దాని పక్కనే అవికాన్‌ స్టూడియో పేరిట యానిమేషన్‌ సంస్థ కూడా ఏర్పాటు చేశాడు. ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయనున్నానని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అది కూడా చిన్నా చితకా యాక్టర్స్ తో కాదండోయ్ ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేశ్తున్నట్టు ప్రచారం చేశాడు. మహేష్ బాబుతో దూకుడు - 2 సినిమా తీస్తున్నట్లు ప్రచారం చేయడంతో సినిమా మీద ఆసక్తి ఉన్న దుండిగల్‌ కు చెందిన జీ పాండురంగనాథ్‌ తాను కూడా పార్టనర్ గా ఉంటానని 80 లక్షలు ఇచ్చాడు. అయితే నెలలు గడుస్తున్నా సినిమా తీయకపోవడం అడిగితే సరైన సమాధానం రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని రంగనాథ్‌ డిమాండ్ చేశాడు. అయితే ఎదురు తిరిగి చంపేస్తానని వెంకటేశ్వర్లు బెదిరించడంతో రంగనాథ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంకటేశ్వర్లును అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతని మీద గోపాలపురం, నారాయణగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు కనిపెట్టారు.

More Related Stories