English   

పందెంకోడి -2 అదే మాస్.. అదే జోష్

Pandem-kodi-teaser-talk
2018-08-31 19:07:43

ఏ రోజైనా కత్తి పట్టే దమ్ముంటే రారా.. ఇక్కడే ఉంటా.. ఈ సీమలోనే ఉంటా అని 2005లో వచ్చిన పందెంకోడి క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను కంటిన్యూ చేస్తూ ఆ విలన్ మళ్లీ వచ్చాడు. అంటే హీరో కూడా రావాలి కదా. అందుకే ఈ మూవీ సీక్వెల్ వస్తోంది. పందెంకోడి-2 అంటూ. ఇవాళ ఈ మూవీ టీజర్ విడుదలైంది. 13యేళ్ల క్రితం ఏ జోష్ లో ఉన్నాడో అదే జోష్ ఇప్పుడూ చూపించాడు విశాల్. అన్నట్టు ఇది అతని 25వ సినిమా కూడా. ఈ సినిమా టైమ్ లో విశాల్ అస్సలు ఏ ఇమేజ్ లేదు. అది కూడా ఇది బ్లాక్ బస్టర్ కావడానికి ఓ కారణమైంది. అతనిప్పుడు మాస్ హీరోగా ఎస్లాబ్లిష్ కావడానికి ఫస్ట్ బీజం వేసిందే ఈ సినిమా. అప్పట్లో హీరోకు సమానంగా హీరోయిన్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అదే అల్లరి మరోసారి రిపీట్ అవుతున్నట్టు క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ను చూస్తే తెలుస్తుంది. అమ్మడు ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఫస్ట్ టైమ్ ఊరమాస్ గా కనిపిస్తోందీ టీజర్ లో. ఇక హీరో తండ్రిని ఓ తిరునాళ్లలో పొడిచినట్టుగా ఓ సీన్ ఉంది. కానీ అది జాగ్రత్తగా గమనిస్తే కానీ తెలియదు. అంటే అప్పుడు సవాల్ విసిరిన విలన్ వచ్చాడన్నమాట. మొత్తంగా ఈ టీజర్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. విశాల్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు లింగుస్వామి మరోసారి అతనికి పందెంకోడి రేంజ్ హిట్ అందివ్వబోతున్నాడని అర్థమౌతోంది. మరోవైపు ఈ దర్శకుడు లింగుస్వామి కూడా చాలాకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న అతను ఏకంగా స్టార్స్ కు కథలు చెప్పే పరిస్థితి కూడా లేదిపుడు. ఈ టైమ్ లో వచ్చిన అవకాశం కాబట్టి ఖచ్చితంగా అతనూ కసిగా తీసి ఉంటాడని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది. దసరా బరిలో నిలిచిన ఈ మూవీ అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. 

More Related Stories