English   

ఎఫ్ 2.. టాలీవుడ్ గోల్ మాల్ కాదు క‌దా..!

Venkatesh-varuntej
2018-09-06 06:59:57

ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు విడుద‌ల‌వుతున్న స్టిల్స్ చూస్తుంటే మాత్రం ఇదే అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు అనిల్ రావిపూడి తెలుగులోకి  గోల్ మాల్ తీసుకొస్తున్నాడేమో అనే అనుమానం రాక మాన‌దు. బాలీవుడ్ లో గోల్ మాల్ సిరీస్ గురించి కొత్త‌గా చెప్ప‌డానికేం లేదు. ఈ సినిమా అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించింది. రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ సిరీస్ అంతా సూప‌ర్ హిట్లే. 2017లో వ‌చ్చిన గోల్ మాల్ అగైన్ కూడా బ్లాక్ బ‌స్ట‌రే. ఇక ఇప్పుడు దీనికి మ‌రో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు రోహిత్. ఇలాంటి టైమ్ లో అనిల్ రావిపూడి కూడా తెలుగులో త‌న‌దైన గోల్ మాల్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈయ‌న ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. మెహ్రీన్, త‌మ‌న్నా హీరోయిన్లు. 

ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పెరుగ్వేలో జ‌రుగుతుంది. అక్క‌డ ఓ పాట చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా అయిన త‌ర్వాత అనిల్ తో క‌లిపి త‌మ‌న్నా, వెంకీ, వ‌రుణ్, మెహ్రీన్ పోజ్ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న తీరు కానీ.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం చూస్తుంటే ఇది గోల్ మాల్ సినిమా మాదిరిగా ఉంటుంది అని తెలుస్తుంది. వెంక‌టేశ్, వ‌రుణ్ పాత్ర‌లు కూడా ఫుల్ కామెడీగా ఉంటాయ‌ని.. క‌డుపులు చెక్క‌లయ్యే కామెడీ ఇందులో అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌మోష‌న్ కూడా గోల్ మాల్ ను గుర్తుకు తెస్తుంది. యూనిట్ అంతా కూర్చుని పోజులివ్వ‌డం కేవ‌లం రోహిత్ శెట్టి సినిమాల‌కు మాత్ర‌మే జ‌రుగుతుంది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా త‌న‌కు వ‌ర‌స‌గా నాలుగో విజ‌యాన్ని అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు అనిల్. ఇదే జ‌రిగితే మ‌నోడి రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. 2019 జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది ఎఫ్ 2. 

More Related Stories