English   

 క‌న్ఫ‌ర్మ్.. బిగ్ బాస్ 2 ఫినాలేకు ఎన్టీఆర్

NTR-BiggBoss2
2018-09-20 14:21:05

ఎప్ప‌ట్నుంచో అభిమానులు కోరుకుంటున్న‌ది కూడా ఇదే. నాని కూడా బిగ్ బాస్ కు ఎన్టీఆర్ ను తీసుకొస్తే అదిరిపోతుంద‌ని.. తీసుకొస్తాన‌ని మాట కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాట నిజంగానే నిజం కాబోతుంద‌ని తెలుస్తుంది. ఎన్టీఆర్ బిగ్ బాస్ 2 హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాదు.. బిగ్ బాస్ ఫైన‌ల్స్ కు జూనియ‌ర్ వ‌స్తున్నాడ‌ని.. అక్క‌డ విన్న‌ర్ ను ప్ర‌క‌టించేది ఈయ‌నే అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. దీన్ని తీసిపారేయ‌లేం కూడా. ఎందుకంటే బిగ్ బాస్ పూర్తి కావ‌డానికి మ‌రో రెండు వారాలు మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే అర‌వింద స‌మేత షూటింగ్ కూడా పూర్తైపోయింది.  డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసాడు ఎన్టీఆర్. బిగ్ బాస్ లో ఎన్నో సినిమాలు ప్ర‌మోట్ చేసుకుంటారు. అలాంటిది ఎన్టీఆర్ కూడా త‌న సినిమా ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో త‌ప్పులేదు క‌దా..! పైగా ఈయ‌న వ‌స్తే రేటింగ్స్ రేంజ్ ఎలా ఉంటుందో ఆ మ‌ధ్య ఢీ ఫైన‌ల్స్ నిరూపించింది. ప‌నిలో ప‌నిగా త‌న సినిమా ప్ర‌మోష‌న్ తో పాటు బిగ్ బాస్ 2 విన్న‌ర్ కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్ర‌క‌టించాల‌ని స్టార్ మా యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తుంది. అన్నింటికంటే ముందు త‌న పాత ప్రోగ్రామ్ క‌దా.. ఆ ఉద్దేశ్యంతోనైనా వ‌స్తాడు జూనియ‌ర్. మ‌రి ఈ యంగ్ టైగ‌ర్ కానీ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెడితే ర‌చ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలిక‌..!

More Related Stories