English   

విశాల్ పందెంకోడి-2 కు డేంజర్ బెల్స్ 

Pandem-Kodi-2
2018-09-21 21:09:31

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొన్నాళ్ల క్రితం అన్నీ రొడ్డకొట్టుడు సినిమాల చేసేవాడు. అవి అక్కడ కొంత వరకూ వర్కవుట్ అయినా ఇక్కడ మాత్రం ఫ్లాప్ లుగా నిలిచాయి. ఇదే టైమ్ అక్కడి ఆడిన్స్ టేస్ట్ లో కూడా మార్పులు వచ్చాయి. దీంతో లాస్ట్ ఇయర్ నుంచి ట్రెండ్ మార్చాడు. డిటెక్టివ్, అభిమన్యుడు అంటూ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సూపర్ హిట్స్ కొట్టాడు.ఆ ఊపులోనే ఇప్పుడు తన కెరీర్ లో 25వ సినిమాతో వస్తున్నాడు. అసలు తన కెరీర్ కు ఊపిరిపోసిన సినిమా పందెంకోడి. ఆ సినిమాకే ఈ 25వ సినిమాకు సీక్వెల్ గా తీసుకున్నాడు విశాల్. లేటెస్ట్ గా విడుదలైన టీజర్ తో పాటు పాటలకూ కొంత వరకూ మంచి ఆదరణే వస్తోంది. కానీ ఓ సెంటిమెంట్ మాత్రం ఈ సినిమాకు డేంజర్ బెల్ లా మారింది. అదే విక్రమ్ ‘సామి స్క్వేర్’. విక్రమ్ సినిమాకు దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అఫ్ కోర్స్ ప్రత్యక్షంగా ఏ సంబంధం లేకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా ఓ సెంటిమెంట్ కనిపిస్తోంది. 

విశాల్ పందెంకోడి టైమ్ కు కాస్త ముందుగానే వచ్చిన సినిమా విక్రమ్ సామి. ఆ సినిమాకు సీక్వెలే ఈ శుక్రవారం వచ్చిన సామి స్క్రేర్. అప్పటి దర్శకుడు హరినే దీనికీ దర్శకుడు. కానీ ఈ సినిమాకు రెండు భాషల్లోనూ డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో విక్రమ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. సీక్వెల్స్ లో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న హరి కూడా ఈ సినిమాను పాస్ చేయలేకపోయాడు. ఇప్పుడు సేమ్ పందెంకోడి విషయంలోనూ సేమ్ జరుగుతోంది. 

పందెంకోడి విశాల్ కెరీర్ కు ఫస్ట్ పిల్లర్. ఆ తర్వాత ఆ సినిమా ఇమేజ్ తోనే అతను ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరో. అయితే 25వ సినిమాగా ఇదే సినిమాను మళ్లీ అదే దర్శకుడు లింగుస్వామితో సీక్వెల్ చేస్తున్నాడు. పైగా లింగుస్వామి ఇప్పుడు హిట్ ట్రాప్ పై లేడు. అంటే సెంటిమెంట్ రిపీట్ అయితే పందెంకోడి-2కు తిప్పలు తప్పవు. పైగా తెలుగులో లాగానే అక్కడి స్టార్ హీరోలెవరికీ 25వ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. అదే బ్యాడ్ సెంటిమెంట్ అంటే ఇప్పుడు సీక్వెల్ కూడా అయింది. అంటే సామి రిజల్టే దీనికీ వస్తుందని చెప్పలేం. కానీ సెంటిమెంట్స్ కు ఎక్కువ వాల్యూ ఇచ్చే ఇండస్ట్రీలో ఇలాంటి డౌట్స్ రావడం కామన్ కదా. ఏదేమైనా అక్టోబర్ 18న దసరా బరిలో నిలిచిందీ పందెంకోడి -2. టైమ్ బావుంది. కానీ ఆ టైమ్ కలిసి రావాలి కూడా. అలా వస్తే సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. లేదంటే పందెంకోడి -2 కు ప్రాబ్లమ్స్ తప్పవు.

More Related Stories