English   

బిగ్ బాస్ 2 హైలైట్స్.. షో ఎందుకు ఫ్లాప్..? 

Bigg-Boss-Telugu
2018-10-01 04:46:22

బిగ్ బాస్ సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ అయింది. దానికి చాలా కార‌ణాలున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ కావ‌డం కూడా అందులో ఓ కార‌ణం కావ‌చ్చు. అయితే ఇప్పుడు నాని హోస్ట్ చేసిన సీజ‌న్ 2 మాత్రం ముందు నుంచి అనుకున్న అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌లం అవుతూనే ఉంది. చివ‌రికి సీజ‌న్ ముగిసిన త‌ర్వాత కూడా దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లీకులు మాత్రం బిగ్ బాస్ 2 కొంప ముంచేసాయి. ఒక్క‌వారం కూడా నాని చెప్పే వ‌ర‌కు ఆగ‌లేదు లీకు రాయుళ్లు. ఫైన‌ల్ విజేత‌ను కూడా నాని చెప్పేకంటే రెండు గంట‌ల ముందే కౌశ‌ల్ అంటూ పోస్ట‌ర్స్ కూడా రిలీజ్ చేసారు. దాంతో బిగ్ బాస్ 2పై ప్ర‌తీవారం ఆస‌క్తి త‌గ్గుతూనే వ‌చ్చింది. 

ఫైన‌ల్ కూడా ఊహించిన దానికంటే పెద్ద‌గా ఏం లేదు. నాని వ‌చ్చిన శ‌ని, ఆదివారాలు కాకుండా మిగిలిన రోజుల్లో షో అనుకున్నంత‌గా రాలేదు కూడా. నిర్వాహ‌కులు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఈ షో చివ‌రి వ‌ర‌కు కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన స్టాండ‌ర్డ్స్ అందుకోలేదు. ఎంత గ్లామ‌ర్ యాడ్ చేసినా.. తేజ‌స్వితో పాటు పూజా, దీప్తి సునైన లాంటి వాళ్లు ఎంత అందాలు ఆర‌బోసినా కూడా పెద్ద‌గా యూజ్ కాలేదు. మ‌రీ ముఖ్యంగా ఫ‌స్ట్ సీజ‌న్ అయితే ఎన్టీఆర్ ముంబైలోని లోనావాలా వెళ్లి షూట్ చేస్తే.. ఆ లైవ్ టెలికాస్ట్ వెంట‌నే అయ్యేది. అక్క‌డ్నుంచి సమాచారం అస్స‌లు బ‌య‌టికి వ‌చ్చేది కాదు. స్టార్ మా చెప్పేంత‌వర‌కు ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తున్నారనే విష‌యం కూడా గోప్య‌మే. 

రెండో సీజ‌న్ అంతా అలా జ‌ర‌గ‌లేదు. ఒక్క ఎపిసోడ్ కూడా లీక్ కాకుండా ఉండ‌లేదు.. ఎలిమినేష‌న్స్ అన్నీ ముందే తెలిసిపోయాయి. అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్ లో సెట్ వేసి చేస్తుండటంతో అన్నీ ముందే లీక్ అయ్యాయి.. ఫైన‌ల్ తో స‌హా. లైవ్ కు.. ప్లే కావ‌డానికి టైమ్ గ్యాప్ ఒక్క‌రోజు ఉండ‌టం రెండో సీజ‌న్ కు క‌లిసిరాలేదు. దాంతో అన్నీ ముందే తెలిసిపోయాయి. అన్నింటికీ మించి మ‌న హీరోల సౌల‌భ్యం కోసం షో ఇక్క‌డ చేస్తుంటే అస‌లు ముచ్చ‌ట ప‌క్క‌దారి ప‌డుతుందని బిగ్ బాస్ 2 విష‌యంలో మ‌రోసారి ప్రూవ్ అయింది. దాంతో రేటింగ్ విష‌యంలో బిగ్ బాస్ 2 ఎప్పుడూ వెన‌కాలే ఉంటుంది. 

ఎన్టీఆర్ ఉన్న‌పుడు బిగ్ బాస్ లో క‌ఠిన‌మైన నియ‌మాలు ఉండేవి. కానీ ఈ సారి అవి క‌నిపించ‌లేదు. తొలి సీజ‌న్ లో సంపూర్ణేష్ అడిగితే ఎలిమినేట్ చేసాడు బిగ్ బాస్. కాన ఈ సారి అంత సీరియ‌స్ నెస్ గేమ్ లో క‌నిపించ‌లేదు. దానికితోడు ఫ‌స్ట్ సీజ‌న్ పార్టిసిపెంట్స్ అంతా ఎవ‌రూ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు రెండో సీజ‌న్ ఏం చేస్తుందా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. ముఖ్యంగా ఇప్ప‌టికే కౌశ‌ల్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు. నేష‌న‌ల్ ఛానెల్స్ లో ఉండే బిగ్ బాస్ వేరు.. మ‌న బిగ్ బాస్ వేరు. దాంతో కంపేర్ చేసుకుంటే అస‌లు మ‌న సీజ‌న్ ఇది కానేకాదు. ఏదేమైనా 113 రోజుల జ‌ర్నీకి ఫుల్ స్టాప్ ప‌డిపోయింది. నాని త‌న ప‌ని ముగించేసుకున్నాడు. మ‌ళ్లీ నెక్ట్స్ సీజ‌న్ కు వ‌స్తాడో రాడో.. చూస్తుంటే వ‌చ్చేలా అయితే క‌నిపించ‌డం లేదు. 

More Related Stories