English   

పందెంకోడి-2 పాట భలే ఉందండోయ్ ... 

Pandem-Kodi-2
2018-10-06 19:31:27

విశాల్ ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా సండాకోళై. తెలుగులో పందెంకోడిగా వచ్చి ఇక్కడా అదే ఇమేజ్ తెచ్చింది. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. పందెంకోడి -2 గా వస్తోన్న ఈ మూవీకి మళ్లీ లింగుస్వామే దర్శకుడు. ఇది విశాల్ కు 25వ సినిమా. ఈ మధ్య కాస్త రూట్ మార్చి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న విశాల్ ఈ పందెంకోడితో మరోసారి ఊరమాస్ యాక్షన్ జోన్ లోకి వెళుతున్నాడు. తనకు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా కాబట్టి మళ్లీ వర్కవుట్ అవుతుందనుకుంటున్నాడేమో కానీ.. ఈ మూవీ ట్రైలర్ కు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ యావరేజ్ ట్రైలర్ అన్న టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ ను తెలుగులో విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. 

సివంగి పిల్లా సివంగి పిల్లా అంటూ సాగే ఈ పాట పూర్తిగా హీరోయిన్ కీర్తి సురేష్ అల్లరిని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగే పాటలా ఉంది. తెలుగులో చంద్రబోస్ రాశాడు. అప్పట్లో మీరా జాస్మిన్ అల్లరికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆ స్థాయిలోనే కీర్తి సురేష్ అల్లరి కూడా ఉంటుందా లేదా అనేది తెలియదు కానీ.. ఈ పాట మాత్రం ఆకట్టుకునేలా ఉంది. పిక్చరైజేషన్ కూడా ఫర్వాలేదనేలా లిరికల్ వీడియోలోని ఇమేజెస్ చెబుతున్నాయి. ఇక ఈ నెల 18న దసరా సందర్భంగా విడుదల కాబోతోన్న ఈ మూవీపై హీరో విశాల్ కంటే ఎక్కువగా దర్శకుడు లింగుస్వామి ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.

More Related Stories