English   

పందెంకోడి 2 ఓవర్సీస్ టాక్ ఏంటి?

Vishal’s Pandem Kodi 2 Overseas Premier Show talk
2018-10-18 07:35:48

విశాల్ సినిమా అంటే తెలుగులో కూడా తెలియ‌ని అంచ‌నాలు ఉంటాయి. ఇక్క‌డ అబ్బాయి కావ‌డంతో మ‌న ద‌గ్గ‌ర కూడా విశాల్ సినిమాకు మంచి డిమాండ్ ఉంటుంది. పైగా ఇప్పుడు 10.50 కోట్ల బిజినెస్ తో పందెంకోడి 2 సంచ‌ల‌నం సృష్టించింది. మ‌న ద‌గ్గ‌ర నిఖిల్ రేంజ్ హీరోల‌కు జ‌రిగే బిజినెస్ ఇది. నాగ‌శౌర్య, సుధీర్ బాబు లాంటి కుర్ర హీరోల కంటే ఎక్కువ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఇప్పుడు పందెంకోడి 2కు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ నుంచి వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తుంటే సినిమాకు రొటీన్ క‌థ కొంప ముంచేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే లింగుస్వామి రేసీ స్క్రీన్ ప్లే కాపాడుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. విశాల్ ఇమేజ్.. కీర్తిసురేష్ గ్లామ‌ర్.. వ‌ర‌ల‌క్ష్మి విల‌నిజం సినిమాకు మెయిన్ హైలైట్ అని.. మూడు యాక్ష‌న్ సీక్వెన్సులు సినిమాకు బ‌లంగా నిలుస్తున్నాయ‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఇవే సినిమా ఫ‌లితాన్ని నిర్ణ‌యించబోతున్నాయి. అవి కానీ వ‌ర్క‌వుట్ అయితే పందెంకోడి 2తో విశాల్ గెలిచినట్లే.. లేదంటే అంతే సంగ‌తులు అంటున్నారు ప్రేక్ష‌కులు. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఎమోష‌న‌ల్ గా ఉండ‌టం పందెంకోడి 2కు క‌లిసొచ్చే అంశం. మ‌రి చూడాలి.. ఈ టాక్ తో విశాల్ ఏం చేస్తాడో..?

More Related Stories