English   

2 మిలియ‌న్ ఈజీ అయిపోయింద‌బ్బా..!

tollywood-2-million

తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయింది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు కురుస్తున్న‌ క‌లెక్ష‌న్ల వాన చూస్తుంటే నిజ‌మే అనిపిస్తుంది. కావాలంటే ఒక్క ఏడాది వెన‌క్కి వెళ్లి చూడండి.. ఓవ‌ర్సీస్ లో 2 మిలియ‌న్ క్రాస్ అయితే అదో అద్భుతంగా చూసేవాళ్లు. 2017 వ‌ర‌కు విదేశాల్లో 2 మిలియ‌న్ దాటిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవ‌చ్చు. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే శ్రీ‌మంతుడు, ఫిదా, అ..ఆ.. నాన్న‌కు ప్రేమ‌తో, ఖైదీ నెం.150 అంతే..! ఇవి కాకుండా మ‌రే సినిమా అది దాట‌లేదు. కానీ కాలెండ‌ర్ మారేస‌రికి సీన్ కూడా మారిపోయింది. ఇప్పుడు 2 మిలియ‌న్ అనేది తెలుగు ఇండ‌స్ట్రీకి కేక్ వాక్. సినిమా బాగుంటే చాలు.. అక్క‌డ వ‌సూళ్ల వ‌ర్షం ఖాయం. 2018లో ఇప్ప‌టికే నాలుగు సినిమాలు 2 మిలియ‌న్ దాటాయి. ఏడాది మొద‌ట్లోనే వ‌చ్చిన అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అయినా కూడా అక్క‌డ 2 మిలియ‌న్ క్రాస్ చేసింది. ఇక రంగ‌స్థ‌లం అయితే ఏకంగా 3.5 మిలియ‌న్ వ‌సూలు చేసి కొత్త రికార్డుల‌కు తెర‌తీసింది. దీని వెన‌కే వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను కూడా 3.4 మిలియన్ కొల్ల‌గొట్టింది. ఇప్పుడు మ‌హాన‌టి కూడా రికార్డుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే 2.3 మిలియ‌న్ దాటేసింది. చూస్తుంటే ఈ చిత్రం కూడా ఫుల్ ర‌న్ లో 3 మిలియ‌న్ క్రాస్ చేసేలా క‌నిపిస్తుంది. ఇప్పుడు ఓవ‌ర్సీస్ లో బాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు సినిమాల ముందు త‌ల వంచాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇదంతా చూస్తుంటే మ‌రో ఏడాదిలో మ‌న మార్కెట్ ఓవ‌ర్సీస్ లో మరింత పెర‌గ‌డం ఖాయం. 
 

More Related Stories