English   

20వ తేదీన రాళ్ళపల్లి అంత్యక్రియలు...అందుకే లేట్ ?

 Rallapalli
2019-05-18 12:01:15

సీనియర్ నటుడు రాళ్లపల్లి దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడు నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మాదాపూర్ మాక్స్ క్యూర్ హాస్పిటల్ లో చనిపోగా అక్కడి నుండి పంజాగుట్ట నిమ్స్ కు అంబులెన్స్ లో రాళ్ళపల్లి పార్థీవ దేహాన్ని తరలించారు. అయితే విదేశాల్లో ఉన్న కూతురు అల్లుడు వచ్చేవరకు నిమ్స్ లొనే రాళ్ళపల్లి బౌతికఖాయాన్ని ఉంచనున్నారు. వారు వచ్చాక అన్ని పనులు పూర్తి చేసి ఈనెల 20వ తారీఖు ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన బంధువులు ప్రకటించారు. రాళ్ళపల్లి మృతికి మూవీ ఆర్టిస్టుల సంఘం సహా మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌, మంత్రి లోకేష్‌ , ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం కేసీఆర్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

More Related Stories