English   

ప్రభాస్ 20 ఫ‌స్ట్ లుక్, టైటిల్ రిలీజ్‌..సంతోషంలో డార్లింగ్ ఫ్యాన్స్‌

Prabhas 20
2020-07-10 10:23:52

సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ జిల్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు జాన్ అని లేదు రాధే శ్యాం అని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా పేరును యూనిట్ ఫైనల్ చేసింది. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలానే పూజ హేగ్దే - ప్రభాస్ లు కౌగులించుకుని ఉన్న ఫస్ట్ లుక్ ని కూడా ఈరోజు పది గంటలకి యూనిట్ రిలీజ్ చేసింది. వైట్ కోట్ లో ప్రభాస్, ఎర్రటి గౌన్ లో పూజా, ఇద్దరూ కౌగలించుకుని కొత్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నారు. 

ఇక వీరి బ్యాక్ గ్రౌండ్ లో ఒక వైపు ఇటలీకి చెందిన లీసా టవర్ ఉంది.  పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ఇటలీ, జార్జియాలలో చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో హైదరాబాద్‌ లోనే అక్కడి సెట్స్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ జోతిష్కుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల తరువాత ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

More Related Stories