English   

20 నిముషాల పాత్రకి భూమిక రెమ్యునరేషన్ విన్నాక షాక్ అయ్యారట 

 Bhumika Chawla
2020-08-17 12:21:11

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల సరసన మెరిసిన భూమికా చావ్లా, పెళ్లి అయినా పూర్తిగా సినిమాలు మానేయకుండా ఒకటీ అరా చేస్తూనే ఉంది. అయితే తెలుగులి హీరోయిన్స్ పరిధి కొంత మేరకే కాబట్టి ఇప్పుడు ఆమె అక్క పాత్రలు, వదిన పాత్రలు చేస్తూ తాను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నానని చెప్పే ప్రయ‌త్నం చేస్తోంది. ఆ మ‌ధ్య ఎంసీఏ, యూ టర్న్, లాంటి కొన్ని సినిమాలు చేసిన ఆమె మళ్ళీ బాలయ్య రూలర్ లో నటించింది. ఆ సినిమా ఫట్ కావడంతో మళ్ళీ సైలెంట్ అయింది భూమిక.  ప్రస్తుతం ఆమె బాక్సర్ అనే సినిమాలో నటిస్తోంది. అంతే కాకా నితిన్ నటిస్తోన్న అందాదున్ రీమేక్ లో కూడా ఈమె నటిస్తోన్నట్టు చెబుతున్నారు. ఇవి కాక ఆమె చేతిలో మరే సినిమాలు లేవు. అయినా ఈమె చెప్పే రెమ్యునరేషన్ వింటే వణుకు వస్తోందట నిర్మాతలకి. ఎందుకంటే తాజాగా ఒక బోల్డ్ కంటెంట్ సినిమాలో 20 నిమిషాల పాత్ర  ఉంది చేయమని అడిగితే ఈ అమ్మగారు ఏకంగా 50 లక్షలు పారితోషికం అడిగిందట. దాంతో దర్శక నిర్మాతలు షాక్ అయ్యి మరొకరిని వెదుక్కునే పనిలో పడ్డారు. 

More Related Stories