English   

ఆసక్తి పుట్టిస్తున్న డిసెంబర్ 20 పోరు.. ఒకేరోజు 4 సినిమాలు..

dec
2019-12-17 07:01:47

ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగబోతుంది. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు కలిసి బాక్సాఫీస్ పై యుద్దం చేయడానికి వస్తున్నాయి. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు కూడా టెన్షన్ తగ్గడం లేదు. హీరోలైతే నిద్ర కూడా పోవడం లేదేమో..? ఎందుకంటే ఒకేరోజు నాలుగు సినిమాలు రావడం చిన్న విషయం కాదు. కానీ మరో డేట్ కూడా లేకపోవడంతో అంతా ఇయర్ ఎండింగ్ పై పడ్డారు. క్రిస్మస్ హాలీడేస్ టార్గెట్ చేస్తూ వరసగా సినిమాలు వస్తున్నాయి. అందులో ముందుగా రూలర్ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేయస్ రవికుమార్ తెరకెక్కించాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు బై ఏ సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం.

ఇక ప్రతిరోజూ పండగే అంటూ సాయి తేజ్ వస్తున్నాడు. చిత్రలహరి సినిమాతో ఆరు ప్లాపుల తర్వాత విజయం అందుకున్న ఈ హీరో మారుతి సినిమాతో పక్కా హిట్ కొడతానంటున్నాడు. ఈ ఇద్దరితో పాటు కార్తి దొంగగా వస్తున్నాడు. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అదే ఊపులో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు కార్తి. పైగా దృశ్యం లాంటి సంచలన సినిమా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దీనికి దర్శకుడు. జ్యోతిక ఇందులో కార్తి అక్కగా నటించింది. ఈ మూడు సినిమాలు ఇలా ఉంటే దబంగ్ 2 అంటూ సల్మాన్ ఖాన్ దండయాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ శుక్రవారం 4 సినిమాలు సందడి చేయబోతున్నాయి.

 

More Related Stories