English   

2017 సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

Mahesh
2020-01-11 16:31:35

సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద  సందడి. సంక్రాంతి పండగ తెలుగు సినిమా ఆ సందడిలో ఒక భాగం. ప్రతి ఏడాది ఈ సీజన్ లో మూడు నుండి నాలుగు సినిమాల దాకా ప్రతి సంవత్సరం విడుదల కావడం ఆనవాయితీ. అయితే విడుదలైన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. అందుకే గతేడాది సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలవ్వగా ఎఫ్ 2 ఒక్కటే హిట్ అయింది. మిగిలిన రెండు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు బకెట్ తన్నేశాయి. 

అంతకు ముందు ఏడాది అంటే 2018 సంక్రాంతి విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన జై సింహా హిట్ టాక్ తెచ్చుకోగా ఎన్నో అంచనాలతో రిలీజయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఇక రంగుల రాట్నం అనే ఒక సినిమా రిలీజ్ అయినట్టు కూడా జనానికి తెలీకుండా పోయింది. అయితే గత రెండేళ్ళు సంక్రాంతి అలా నడిస్తే అంతకు ముందు 2017 సంక్రాంతి మాత్రం టాలీవుడ్ కు మంచి ఓపెనింగ్ ని ఇచ్చింది సంక్రాంతి. 

ఎందుకంటే 2017 సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడంతో ఆ సీజన్ టాలీవుడ్ కళకళలాడింది. ఈ ఏడాది కూడా విడుదలయిన నాలుగు సినిమాలు (దర్బార్ తో సహా) మంచిగా ఆడచ్చు. ఇప్పటికే రజినీకాంత్ దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాలు విడుదలైపోయాయి. దర్బార్ కు యావరేజ్ టాక్ రాగా, సరిలేరు నీకెవ్వరు సినిమాకి సూపర్ హిట్ టాక్ వచేసినట్టే !ఇక రేపు విడుదల కానున్న అల వైకుంఠపురములో, ఈ నెల 15న రానున్న ఎంత మంచివాడవురా సినిమాలకి కూడా బాగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ రెండిటికీ కూడా హిట్ టాక్ వస్తే 2017 సెంటిమెంట్ రిపీట్ అయినట్టే.

More Related Stories