English   

నేను 2017 నుండి గర్భవతిని.... సమంత షాకింగ్ కామెంట్స్ 

Samantha
2020-08-31 14:45:06

తెలుగులోనే కాక దక్షిణాది బాషలన్నిటిలో టాప్ రేసులో దూసుకుపోతున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అక్కినేని కోడలయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలపై దృష్టి పెట్టి నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా జాను అని తమిళ ‘96’ తెలుగు రీమేక్‌ తో ముంచుకు వచ్చిన ఆమె ఆ సినిమా తప్ప మరే సినిమా ప్రకటించలేదు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌ లో నటిస్తున్నానని చెప్పి తాజగా దానికి సంబందించిన డబ్బింగ్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఇక ఆమె ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. మరి ఎందుకో ఏమో ఆ మధ్య దానికి ఆమె దూరం అయింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పాపానికి ఆమె గురించి ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. 

ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ సైలెంట్ అయిందంటే ఏదో ఉందని కొందరు గట్టిగానే నమ్మారు. మరికొందరు ఏమో సమంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుందని పుకారు పుట్టించారు. తాజాగా ఇన్‌స్టాలో `ఆస్క్ సమంత` సెషన్‌ లో ఈమె పాల్గొంది. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే మీరు గర్భవతా? అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా… దానికి సమాధానంగా.. 2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని.. అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని కొంటెగా సమాధానమిచ్చింది. అలా ప్రెగ్నెన్సీ వార్తల మీద పరోక్షంగా సెటైర్ వేసింది.

More Related Stories