English   

2017 లో చేసిన ట్వీట్ వైరల్..ఇప్పుడు వివరణ ఇచ్చిన శృతి

 Shruti Haasan
2021-02-17 16:06:04

నాలుగేళ్ళ క్రితం చేసిన ఓ ట్వీట్ పై అందాల భామ శృతిహాసన్ ఇప్పుడు స్పందించింది. మరి ఇన్నాళ్లు అసలు స్పందించాల్సిన అవసరం ఏముందనుకుందో..లేదంటే బిజీగా ఉండి స్పందించలేకపోయిందో కానీ నాలుగేళ్ళ తరవాత స్పందించడం విశేషం. అసలు నాలుగేళ్ళ క్రితం శృతి ఏమని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఎలా స్పందించింది అన్నది ఇప్పుడు చూద్దాం. 2017లో శృతిహాసన్  ను ఒక కన్నడ సినిమా కోసం సంప్రదించారు. అయితే తాను ప్రస్తుతం కన్నడ సినిమాలు చేయలనుకోవడం లేదని ఎవరూ సంప్రదించవద్దని చెప్పిందట. ఈ విషయం కాస్తా అప్పట్లో వైరల్ అయ్యింది. కన్నడ ప్రేక్షకులు శృతిపై మండిపడ్డారు. 

అయితే అప్పుడు శృతి దానిపై స్పందించలేదు. కానీ మళ్ళీ నాలుగేళ్ళ తరవాత శృతికి అప్పటి వ్యాఖ్యలే తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం శృతి సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు యష్ కన్నడ దర్శకుడే కాబట్టి ...అప్పుడు కన్నడ సినిమాలు చేయనని చెప్పి ఇప్పుడు కన్నడ దర్శకుడితో ఎలా చేస్తున్నావంటూ కన్నడ ప్రేక్షకులు మళ్ళీ శృతిపై ట్రోల్స్ మొదలెట్టారు. దాంతో శ్రుతిహాసన్ తాజాగా స్పందించింది. తాను అప్పట్లో డేట్స్ సమస్య వల్ల కన్నడ సినిమాలో నటించలేదని కానీ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. అంతే కాకుండా తన కు అన్ని భాషల్లోనూ నటించడం ఇష్టమేనని తెలిపింది. సలార్ కథ తనకు ఎంతో నచ్చిందని..అందుకే ఈ సినిమాకు ఒకే చెప్పినట్టు పేర్కొంది.

More Related Stories