ట్యాక్సీవాలా బ్రేకింగ్ అప్ డేట్.. 2018 నుంచి ఔట్..

అసలు ఎప్పుడు రావాల్సిన సినిమా.. ఇంకా ఎందుకు బాక్సాఫీస్ దగ్గరికి రాకుండా బాక్సుల్లోనే మగ్గిపోంతుంది. అసలు రావడం లేదా.. రాకుండా ఆపుతున్నారా..? ఇప్పుడు విజయ్ దేరవకొండ సినిమా అంటే చిన్నదే కాదు. వస్తే రానీ.. లేకపోతే లేదు అని లైట్ తీసుకోడానికి. ఈయన 100 కోట్ల హీరో ఇప్పుడు. రెండు రోజుల్లోనే పెట్టుబడితో పాటు బయ్యర్లను లాభాల్లోకి తీసుకెళ్లేంత స్టామినా ఉన్న హీరో. అలాంటి హీరో నటించిన సినిమా బైటికి రానంటూ మూడు నెలలుగా బాక్సుల్లోనే ఉండిపోయింది. అదే ట్యాక్సీవాలా. గీతగోవిందం తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్న ట్యాక్సీవాలాను మళ్లీ ఆపి ముందు నోటా తీసుకొస్తున్నారు. పైగా ఈ సినిమాకు రిపేర్లు మొదలయ్యాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బండి షెడ్ లో ఉంది. కానీ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ మాత్రం తన సినిమా పూర్తైందని.. త్వరలోనే విడుదల కానుందని చెబుతున్నాడు. కానీ ఆ త్వరలో ఎప్పుడు అనేది తెలియదు. ఆయనకే కాదు నిర్మాతలకు కూడా దీనిపై క్లారిటీ రావట్లేదు.
ఇప్పుడు విజయ్ కు పెరిగిన ఇమేజ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా కథను మార్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా గీతాఆర్ట్స్ లోనే కావడంతో కాస్త ఆలస్యమైనా పర్లేదంటున్నాడు అల్లు అరవింద్. ఆయనతో పాటు యువీ క్రియేషన్స్ కూడా ట్యాక్సీవాలా నిర్మాతల లిస్ట్ లో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో కానీ విజయ్ కు ఫ్లాప్ వస్తే చేసిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అందుకే లేటైనా లేటెస్ట్ గా రావాలని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. ట్యాక్సీవాలా కానీ హిట్టయిందా.. ఇక విజయ్ ను ఆపేవాడు కనిపించడు. ఆయన తోపే.. ఇప్పటికీ తోపే.. కాకపోతే ట్యాక్సీవాలా హిట్ తర్వాత మరింత పెద్ద తోపు అయిపోతాడు. ఇది జరగాలంటే ముందు ట్యాక్సీ షెడ్ వదిలి బయటికి రావాలి. దానికంటే ముందు టైమ్ వేస్ట్ చేయకుండా నోటా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ట్యాక్సీవాలాను విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.