English   

2019లో దిల్ రాజు మ‌ళ్ళీ మొద‌లుపెట్టాడండోయ్.. 

Dil-Raju
2019-01-13 10:50:48

2017లో వరసగా ఆరు విజ‌యాల‌తో సంచలనం సృష్టించాడు దిల్ రాజు. ఈయ‌న నిర్మించిన ప్రతి సినిమా నిర్మాతగా ఆయనకు చాలా లాభాలు తీసుకొచ్చింది. దిల్ రాజు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకున్నారు. కానీ 2018 వచ్చేసరికి అంతా మారిపోయింది. గతేడాది ఈయ‌న నిర్మించిన మూడు సినిమాలు పెద్దగా నచ్చలేదు ప్రేక్షకులకు. లవర్ డిజాస్టర్ గా నిలిస్తే శ్రీనివాస కళ్యాణం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికితోడు ఏడాది చివ‌ర్లో వ‌చ్చిన రామ్ హలో గురు ప్రేమకోసమే మాత్రం కాస్త యావ‌రేజ్ టాక్ తో బయటపడింది. దాంతో 2019 తన కెరీర్ కు కీలకమని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు దిల్ రాజు. సంక్రాంతి పండక్కి ఎఫ్2 సినిమాతో వచ్చాడు ఈ నిర్మాత. 

నాలుగు సినిమాల్లో దీనికి మంచి టాక్ వచ్చింది. పండగ విన్నర్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ఎఫ్2 అంటున్నారు ప్రేక్షకులు. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి కామెడీ చేసిన సినిమా ఇది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనేది ఈజీగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాన్ని తీసుకొని అనిల్ రావిపూడి తన మార్కు స్క్రీన్ ప్లే అది ప్రేక్షకులకు కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు. ఈ సినిమా తొలి రోజు దాదాపు నాలుగు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. ఇదే జోరు కంటిన్యూ అయితే పండగ సెలవులు పూర్తయ్యేలోపు సూపర్ హిట్ స్టేటస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories