English   

షాకింగ్.. 2019లో బాలకృష్ణ మూడు సినిమాలు..

balakrishna three back to back movies in 2019
2019-01-17 20:08:57

ఇప్పటికే సంక్రాంతికి కథానాయకుడు సినిమాతో వచ్చాడు బాలకృష్ణ. ఫిబ్రవరి 7న మహానాయకుడు విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే మరో మూడు సినిమాలకు రంగం సిద్ధం చేశాడు బాలకృష్ణ. ఫిబ్రవరి నుంచి బోయపాటి శ్రీను సినిమాతో బిజీ కానున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ చిత్ర కథ కూడా సిద్ధమైపోయింది. NBK ఫిలిమ్స్ బ్యానర్ పైనే బాలయ్య బోయపాటి సినిమా ఉండబోతుంది. ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. సింహ, లెజెండ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక బాలయ్య కూడా బోయపాటిపై పూర్తి నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ పారితోషకం తీసుకుంటున్నారు బోయపాటి శ్రీను. ఈయనతో పాటు మరో ఇద్దరు దర్శకులను కూడా కన్ఫర్మ్ చేశాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడితో కూడా ఈయన ఓ సినిమా చేయబోతున్నాడు. నిజానికి బాలయ్య వందో సినిమా జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. కాకపోతే అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈయన కోసం ఒక మంచి స్క్రిప్టు సిద్ధం చేశాడని తెలుస్తోంది అనిల్ రావిపూడి. ఈయనతోపాటు వినాయక్ కూడా ఇంకా లైన్ లోనే ఉన్నాడు. ఆయన సినిమా కూడా 2019లో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య స్పీడు చూస్తుంటే అభిమానులకు జోరు తగ్గడం లేదు.

More Related Stories