English   

2019లో స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం..

Samantha Akkineni take sensational decision on non-veg
2019-01-27 20:19:13

కొత్త ఏడాదిలో సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈమె సామాజిక కార్యక్రమాలు చేస్తూ నటిగానే కాకుండా సోషల్ వర్కర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈమె తీసుకున్న ఒక నిర్ణయం సంచలనం అయిపోయింది. తన వల్ల ఎవరైనా బాధ పడినా.. ఏదైనా జరిగిన తాను తట్టుకోలేనని చెబుతోంది సమంత. అందుకే కొత్త ఏడాది సరికొత్త నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ‌. ఇప్పటి నుంచి ఈమె మాంసాహారం తినడం మానేసింది. ఇంకో ప్రాణికి హాని చేయడం తనకు ఇష్టం లేదని.. అందుకే మానేస్తున్న‌ట్లు చెప్పింది సమంత. ఇక నుంచి కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటానని.. ఆరోగ్యానికి కూడా అదే మంచిది అంటుంది ఈ ముద్దుగుమ్మ‌.
అక్కినేని కోడ‌లు తీసుకున్న నిర్ణయంతో భ‌ర్త నాగచైతన్య కూడా షాక్ అయిపోయాడు. అయితే సమంత తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న మంచిని అర్థం చేసుకొని ఆయన కూడా సంతోష పడ్డాడు కూడా. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే నాగచైతన్యతో నటిస్తున్న మజిలీ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. ఈ సినిమా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. శివ నిర్వాణ‌ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు శర్వానంద్ హీరోగా 96 తెలుగు రీమేక్ లో నటించడానికి ఒప్పుకుంది సమంత. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొత్తానికి అటు సినిమాలతో ఇటు పర్సనల్ లైఫ్ తో బిజీగా ఉంది సమంత.

More Related Stories