English   

2019లో సినిమాలు చేయని దర్శకులు వీళ్లే..

Tollywood
2019-12-18 15:48:11

ఒకప్పుడు దర్శకులు ప్రతీ ఏడాది కనీసం ఒక్క సినిమా అయినా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓ సినిమా చేసిన తర్వాత రెండేళ్ల వరకు మళ్లీ సినిమాలు చేయడం లేదు. ఒక్కో సినిమా కోసం అంత గ్యాప్ తీసుకుంటున్నారు. 2019లో చాలా మంది దర్శకులు కనిపించలేదు. వాళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.. 

1. రాజమౌళి

దాదాపు 19 ఏళ్ల కెరీర్ లో రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలు 12 మాత్రమే. దాన్నిబట్టి ఈయన ఎంత నెమ్మదిగా సినిమాలు చేస్తాడనేది అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని విజయాలే. 2017లో బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుంచి సినిమా రాలేదు. అప్పట్నుంచీ ఈయన RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. 2020లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విడుదల కానుంది. 

2. వినాయక్

2018 ఫిబ్రవరిలో ఇంటిలిజెంట్ సినిమాతో వచ్చాడు వినాయక్. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో మళ్లీ వినాయక్ వైపు హీరోలెవరూ చూడలేదు. బాలయ్యతో సినిమా కమిట్ అయినా కూడా అది కూడా పట్టాలెక్కలేదు. దాంతో ఈయనే హీరోగా మారిపోయాడు. 2019లో వినాయక్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఈయన దర్శకుడిగా కాకుండా హీరోగా శీనయ్య అనే సినిమా చేస్తున్నాడు. 

3. సుకుమార్

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ వరస సినిమాలు చేయాల్సింది పోయి వచ్చిన క్రేజ్ అస్సలు క్యాష్ చేసుకోలేకపోయాడు. 2018 మార్చ్ 30న రంగస్థలం విడుదలైతే ఇప్పటి వరకు మరో సినిమా పట్టాలెక్కించలేకపోయాడు సుకుమార్. ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ స్లో అయిపోయాడు. మహేష్ బాబుకు ఓ కథ చెప్పినా కూడా ప్రకటన తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమాకు సిద్ధం అవుతున్నాడు సుకుమార్.

4. కొరటాల శివ

భరత్ అనే నేను లాంటి సినిమా తర్వాత కొరటాల శివ మళ్లీ ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈయన చిరంజీవి కోసం కథ సిద్ధం చేసాడు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2020 దసరాకు విడుదల ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. 2019లో కొరటాల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 

5. త్రివిక్రమ్ శ్రీనివాస్

2018లో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2019లో మాత్రం ఒక్కటీ విడుదల చేయలేదు. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత పట్టుదలతో అరవింద సమేత సినిమా చేసి పర్లేదనిపించుకున్నాడు మాటల మాంత్రికుడు. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి 2020కి విడుదల కానుంది. జనవరి 12న రానుంది ఈ చిత్రం. 

6. తరుణ్ భాస్కర్

ఈ నగరానికి ఏమైంది అంటూ 2018లో పలకరించిన తరుణ్ భాస్కర్.. 2019లో హీరో అయ్యాడు కానీ దర్శకుడిగా సినిమా చేయలేదు. మీకు మాత్రమే చెప్తానంటూ నటన చూపించాడు. కానీ దర్శకుడిగా ఒక్కసినిమా కూడా కమిట్ కాలేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సురేష్ ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం ఉండబోతుంది. 

7. సందీప్ రెడ్డి వంగా

2017లో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఇప్పటికీ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లోనే ఉన్నాడు ఈయన. ఇదే సినిమాను హిందీలో ఈ ఏడాది కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్ట్రర్ అందుకున్నాడు. ఇక తెలుగులో మానేసి ప్రస్తుతం హిందీలో క్రైమ్ కహానీ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. 

8. పరుశురామ్

విజయ్ దేవరకొండను స్టార్ గా మార్చిన సినిమా అర్జున్ రెడ్డి అయితే సూపర్ స్టార్ ను చేసిన సినిమా గీత గోవిందం. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చేరువ చేసిన సినిమా ఇది. దీని దర్శకుడు పరుశురామ్. దాదాపు 70 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంతటి విజయం తర్వాత కూడా తన రేంజ్ మార్చుకోలేకపోయాడు పరుశురామ్. గీత గోవిందం వచ్చిన ఏడాదిన్నర తర్వాత నాగ చైతన్యతో ఈ మధ్యే తన నెక్ట్స్ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు పరుశురామ్. దాంతో 2019 ఖాళీగానే మిగిలిపోయింది ఈ దర్శకుడికి. 

9. శేఖర్ కమ్ముల

2017లో ఫిదాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు.. రెండేళ్లుగా మరో సినిమా చేయలేదు. ఈయన కొత్త వాళ్లతో ఓ సినిమా మొదలుపెట్టి సగం షూట్ చేసిన తర్వాత ఆపేసాడు. దాంతో అదే సినిమాను ఇప్పుడు నాగ చైతన్య, సాయి పల్లవితో రీ షూట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. 2020 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

10. నాగ్ అశ్విన్

మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డులు అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఈయన ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడంలో గ్యాప్ తీసుకుంటున్నాడు. 2019లో ఈయన ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటన కూడా రాలేదు. వీళ్ళతో పాటు కృష్ణవంశీ, వేణు శ్రీరామ్ లాంటి చాలా మంది దర్శకులు 2019లో మిస్ కొట్టారు.

More Related Stories