English   

2019లో దారుణంగా నిరాశపరిచిన డిజాస్టర్స్ ఇవే..

cinema
2019-12-22 18:25:59

వినయ విధేయ రామ: రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చింది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం సంచలనాలు రేపుతుందనుకుంటే దారుణంగా నిరాశ పరిచింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 35 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది.
ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు అత్యంత దారుణంగా ముంచేసాయి. ఈ రెండు సినిమాలు కనీసం వసూళ్లు తీసుకురాలేకపోయాయి. పెద్దాయన ఇమేజ్ తీసారంటూ బాలయ్యకు విమర్శలు కూడా వచ్చాయి. క్రిష్ దీనికి దర్శకుడు. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 60 కోట్లకు పైగానే ముంచేసాయి.
మిస్టర్ మజ్ను: అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను కూడా నిరాశ పరిచింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో వెనకబడిపోయాడు అఖిల్. దాంతో నిరాశ తప్పలేదు.
మన్మథుడు 2: నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2 ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కనీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు ఈ చిత్రం. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ వయసులో ఇలాంటి సినిమాలేంటి అంటూ నాగార్జున విమర్శలు కూడా అందుకున్నాడు.
డియర్ కామ్రేడ్: విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాలతో విడుదలైంది. సౌత్ భాషలన్నింటిలో విడుదలైన డియర్ కామ్రేడ్ అన్నిచోట్లా ప్లాప్ అయింది. చివరికి బయ్యర్లకు దాదాపు 15 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
గ్యాంగ్ లీడర్: జెర్సీ లాంటి సినిమా తర్వాత నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ కూడా దారుణంగా పరాజయం పాలైంది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 13 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది.
ఓటర్: మంచు విష్ణు నటించిన ఓటర్ చిత్రం కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు తెలియదంటే ఎంతటి డిజాస్టర్ అనేది చెప్పాల్సిన పనిలేదు.
కల్కి: గరుడవేగ సినిమాతో రెండేళ్ల కింద తానున్నానని గుర్తు చేసిన రాజశేఖర్.. ఈ ఏడాది కల్కి సినిమాతో మరో హిట్ అందుకోవాలనుకున్నాడు కానీ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి డిజాస్టర్ అయిపోయింది.
గుణ 369, 90 ఎమ్ఎల్: ఆర్ఎక్స్ 100 కార్తికేయ 2019లో మూడు సినిమాలతో వచ్చాడు. మూడు ఫ్లాప్ అయ్యాయి. గ్యాంగ్ లీడర్‌లో విలన్‌గా నటించాడు. ఇక హీరోగా నటించిన గుణ 369, 90 ఎమ్ఎల్ సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరిచాయి. మూడు ఫ్లాపులతో 2019ని ముగించాడు కార్తికేయ.
సాహో: 2019లో అతిపెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది ప్రభాస్ సాహో. బాహుబలి 2 లాంటి సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ అయిపోయింది. హిందీలో 160 కోట్ల వరకు వసూలు చేసి అక్కడ హిట్ కొట్టింది కానీ తెలుగులో మాత్రం దాదాపు 50 కోట్లకు పైగానే నష్టాలు తీసుకొచ్చింది.
చాణక్య: గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన చిత్రం చాణక్య. ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా అలరించలేదు.
రాజుగారిగది 3: ఓంకార్ తెరకెక్కించిన రాజుగారిగది 3 కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
తెనాలి రామకృష్ణ: సందీప్ కిషన్ ఈ ఏడాది కూడా విజయం అందుకోలేకపోయాడు. నిను వీడని నీడని నేనే సినిమాతో పర్లేదనిపించిన ఈ హీరో.. తెనాలి రామకృష్ణతో డిజాస్టర్ ఇచ్చాడు.
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు: వర్మ నానా హడావిడి చేసిన తీసిన సినిమా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఎన్నో తంటాలు పడి విడుదలైన ఈ చిత్రం కనీసం ఒక్కరోజు కూడా థియేటర్స్‌లో ఉండలేదు. ఇందులో విషయం తక్కువ.. బిల్డప్ తక్కువగా ఉండటంతో ప్రభావం భారీగానే పడింది.
రూలర్: బాలయ్య నటించిన రూలర్ సినిమా ఈ వారమే విడుదలైంది. కానీ టాక్ మాత్రం నెగిటివ్ ఉండటంతో కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

More Related Stories