English   

2019 డబ్బింగ్ సినిమాలు.. కంటితుడుపు విజయాలే..

2019 dubbing movies
2019-12-28 17:17:35

2019లో కూడా డబ్బింగ్ సినిమాల జాతకం మారలేదు. కొన్నేళ్లుగా అనువాద సినిమాలు తెలుగులో విజయం సాధించడం కష్టంగా మారుతుంది. బాగున్న సినిమాలు కూడా ఇక్కడ ఆడటం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. విజిల్, ఖైదీ లాంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే 2019లో డబ్బింగ్ సినిమాలు విజయం సాధించింది లేదు.

పేట: పేట సినిమాతో సంక్రాంతికి వచ్చాడు రజినీకాంత్. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా మన సినిమాలు ఉండటంతో కనీసం 5 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది పేట.

మణికర్ణిక: ‘మణికర్ణిక’ చిత్రంతో జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా రనౌత్. క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంపై చాలా వివాదాలు నడిచాయి. చివరికి అన్నీ దాటుకుని వచ్చినా కూడా తెలుగులో మణికర్ణికకు కాలం కలిసిరాలేదు.

దేవ్: కార్తి దేవ్ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియదు. ఈ చిత్రం కార్తి కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రకుల్ ప్రీత్ ఇందులో హీరోయిన్.

లవర్స్ డే: ప్రియా ప్రకాశ్ వారియర్ పుణ్యమా అని మళయాలం సినిమాకు కూడా తెలుగులో మంచి ఇమేజ్ వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఒరు అదార్ లవ్ తెలుగు వర్షన్ లవర్స్ డే కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది.

ఐరా, అంజలి సిబిఐ: నయనతార నుంచి ఈ ఏడాది రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అంజలి సిబిఐ, ఐరా ఈ రెండు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి.

విశ్వాసం: శివ దర్శకత్వంలో అజిత్ నటించిన నాలుగో సినిమా ‘విశ్వాసం’. ఈ చిత్రం తమిళనాట విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం అజిత్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. నయనతార హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో.

కాంచన 3: ముని సిరీస్‌లో వచ్చిన మరో సినిమా ‘కాంచన 3’. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. తెలుగులో కూడా పర్లేదనిపించింది కాంచన 3.

NGK: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ngk. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వచ్చింది. కానీ అభిమానులను అలరించడంలో మాత్రం పూర్తిగా దారితప్పింది.

బందోబస్త్: మోహన్‌లాల్, సూర్య క్రేజీ కాంబినేషన్‌లో కేవీ ఆనంద్ తెరకెక్కించిన సినిమా బందోబస్త్. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది బందోబస్త్ సినిమా.

URI: హిందీలో విడుదలైన కొన్ని నెలల తర్వాత తెలుగులో uri సినిమాను అనువదించారు. కానీ ఈ చిత్రం వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. పైగా అప్పటికే చాలా మంది హిందీలో సినిమా చూసారు. దాంతో తెలుగులో విడుదలైనా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

ఖైదీ: కార్తి ‘ఖైదీ’ సినిమా ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. దివాళికి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీపై ప్రశంసల జల్లు కురిసింది. దాదాపు 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

దొంగ: ఈ ఏడాది కార్తి నుంచి వచ్చిన మూడో సినిమా దొంగ. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా స్లో నెరేషన్‌తో కలెక్షన్స్ వేటలో వెనకబడిపోయింది. జ్యోతిక ఈ చిత్రంలో కార్తికి అక్కగా నటించింది.

ఆమె: అమలా పాల్ నటించిన ఆడై సినిమాను తెలుగులో ఆమెగా రిలీజ్ చేసారు. విడుదలకు ముందే చాలా వివాదాలు తెచ్చుకున్న ఈ చిత్రం తమిళంలో పర్లేదనిపించినా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది. అన్నట్లు ఈ చిత్రంలో నగ్నంగా నటించింది అమలా పాల్.

మిస్టర్ కేకే: కమల్ హాసన్ నిర్మాణంలో అక్షర హాసన్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్టర్ కేకే. ఈ చిత్రం అత్యంత దారుణంగా డిజాస్టర్ అయింది. ఇందులో విక్రమ్ అసలు పేరు ‘కెనడీ జాన్ విక్టర్’. కనీసం ఈ చిత్రం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.

యాక్షన్, అయోగ్య: విశాల్ యాక్షన్ సినిమా కూడా తెలుగులో పెద్దగా అలరించలేదు. తమిళనాట కూడా ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడింది. సుందర్ సి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతగా ఆకట్టుకోలేదు. మరో సినిమా అయోగ్య కూడా ఆడలేదు. టెంపర్ సినిమానే రీమేక్ చేసి మళ్లీ మనకే విడుదల చేసాడు విశాల్.

వార్: యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్. అక్టోబర్ 2న చిరంజీవి సైరాకు పోటీగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చింది. హిందీలో అయితే బ్లాక్ బస్టర్ అయింది వార్.

విజిల్: ఈ మధ్య తెలుగులో కూడా వరస విజయాలు అందుకుంటున్న విజయ్.. 2019లో కూడా మంచి సినిమాతోనే వచ్చాడు. ఈయన నటించిన విజిల్ తెలుగులో కూడా 12 కోట్ల వరకు వసూలు చేసి హిట్ అనిపించుకుంది. గతేడాది సర్కార్ సినిమాతో విజయం అందుకున్న విజయ్.. ఈ సారి విజిల్ వేయించాడు.

మామాంగం: కేరళ యుద్ద విద్యల నేపథ్యంలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మామాంగం సినిమా తెలుగులో అస్సలు ఆకట్టుకోలేదు. ఈ చిత్రం అక్కడ కూడా డిజాస్టర్ అయిపోయింది. యాత్ర సినిమాతో తెలుగులో మరోసారి మెరిసిన మమ్ముట్టి మామాంగంతో మాయ చేయలేకపోయాడు.
 

More Related Stories