English   

ద ఇయర్ ఆఫ్ బయోపిక్స్  2019

2019 A year biopics for Tollywood
2019-12-31 11:03:56

ఈ ఏడాది టాలీవుడ్ ఒక అరుదైన విషయం నమోదు చేసుకుంది. అదేంటంటే గతంలో ఎప్పుడో ఒకటీ అరా అన్నట్లుగా వచ్చే బయోపిక్స్ ఈ ఏడాది అనుకోని రీతిలో పెద్ద సంఖ్యలో వచ్చి పడ్డాయి. దీంతో ‘ 2019 – ద ఇయర్ ఆఫ్ బయోపిక్స్ ‘ గా చరిత్రలో నిలిచిపోయింది. హిట్టా ఫట్టా అనే సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం విడుదలైనన్ని బయోపిక్స్ గతంలో ఎప్పుడూ విడుదలయినట్టు చరిత్రలో లేదు. ఇక ముందు కాకపోవచ్చు కూడా ఒక భాషలో ఒక క్యాలెండర్ ఇయర్లో మళ్ళీ ఇన్ని బయోపిక్స్ తెరకేక్కుతాయని చెప్పలేం. ఓకే బాషలో ఏకంగా 7 బయోపిక్స్ విడుదల కావటం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. 

ఏడాది మొదట్లో ముందుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత హానేత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే టైటిల్స్ తో రెండు భాగాలుగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి ఆయనే హీరోగా నటించటం విశేషం. ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందిన రెండు భాగాలలో మొదటిదైన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కాగా, ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలైంది. 

ఇక ఎన్టీఆర్ చరమాంకంలో జరిగిన వివాదాస్పద విషయాలనే కథాంశంగా తీసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన’ లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 29 న విడుదలైంది. ఇక మరో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా మహీ వీ. రాఘవ దర్శకత్వంలో నిర్మితమైన బయోపిక్” యాత్ర” ఫిబ్రవరి 8న విడుదల అయింది. అనంతరం జూన్ 21న చేనేత కార్మికునిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా అర్.రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ మల్లేశం’ విడుదలైంది. 

ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా చరిత్ర కెక్కిన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన’ జార్జి రెడ్డి’ నవంబర్ 22 న విడుదలయింది. ఆ తరువాత తెలుగు చలనచిత్ర రంగ పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బాబ్జి దర్శకత్వంలో సతీష్ నాయుడు నిర్మించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ నవంబర్ 29న విడుదలైంది. 

More Related Stories