English   

మెగా మేనల్లుడికి 2019లో ప్రతిరోజూ పండగే..

 Sai Dharam Tej
2019-12-31 11:25:35

కొందరి హీరోలకు కొన్ని సంవత్సరాల కలిసొస్తాయి అంతే. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్ అయిపోయింది.. ఇక బ్యాగ్ సర్దుకోవడం తరువాయి అనుకుంటున్న సమయంలో 2019లో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా మారుతి తెరకెక్కించిన ప్రతి రోజూ పండగే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 18 కోట్ల బిజినెస్ చేస్తే ఏకంగా ఇప్పటికి 24 కోట్ల షేర్ వసూలు చేసింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి మరో వారం రోజుల పాటు ఈ సినిమాకు ఎలాంటి ఢోకా లేదు. ఖచ్చితంగా 30 కోట్ల షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది ప్రతిరోజూ పండగే. దీనికంటే ముందు సమ్మర్లో వచ్చిన చిత్రలహరి సినిమా కూడా మంచి విజయం సాధించింది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో ఫెయిల్యూర్ అబ్బాయిగా నటించాడు. సాయి ధరమ్ తేజ్ అప్పటికే వరసగా ఆరు డిజాస్టర్స్ ఉండటంతో ప్రేక్షకులు కూడా ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో సినిమా ఈజీగా సక్సెస్ బాట పట్టింది. 14 కోట్ల బిజినెస్ చేసిన చిత్రలహరి 15 కోట్లకు పైగా వసూలు చేసి విజయం అనిపించుకుంది. మొత్తానికి అయిపోయింది అనుకుంటున్న టైంలో వరుసగా రెండు విజయాలు సాధించి తాను ఇంకా రేస్ లోనే ఉన్నానని చూపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగా మేనల్లుడు. 

More Related Stories