English   

2019లో వాళ్లకు రెండు రెండు విజయాలు..

 Naga chaitanya varun tej
2019-12-31 13:45:38

ఈ రోజుల్లో ఒక విజయం అందుకోవడం కష్టంగా మారిపోయింది. అలాంటిది ఒకే సంవత్సరం రెండు సినిమాలతో వచ్చి రెండు విజయాలు అందుకోవడం చిన్న విషయం కాదు. కానీ 2019లో కొందరు హీరోలు ఇది చేసి చూపించారు. అందులో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది ఈయన నుంచి రెండు సినిమాలు వచ్చాయి. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా 2019లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక డిసెంబర్లో వెంకీ మామతో వచ్చి మరో విజయం అందుకున్నాడు వెంకటేష్ ఈయనతో పాటు ఈయన మేనల్లుడు నాగచైతన్య కూడా 2019లో రెండు విజయాలు అందుకొన్నాడు మండువేసవిలో భార్యతో కలిసి నటించిన మజిలీ సినిమా మంచి విజయం సాధించింది శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 40 కోట్ల షేర్ వసూలు చేసి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక డిసెంబరులో మేనమామ వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాతో వచ్చాడు నాగ చైతన్య వరుణ్ తేజ్ కూడా 2019లో రెండు విజయాలు అందుకున్నాడు. సంక్రాంతి పండక్కి ఎఫ్2.. మొన్న గద్దలకొండ గణేష్ సినిమాలతో రఫ్ఫాడించాడు మెగా హీరో. వీటితో వరుణ్ మార్కెట్ కూడా భారీగానే పెరిగింది. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా 2019లో మాయ చేసాడు. ఈయన కూడా రెండు విజయాలు అందుకుని ఔరా అనిపించాడు. సమ్మర్ లో చిత్రలహరి.. ఇప్పుడు ప్రతిరోజూ పండగే సినిమాలతో దుమ్ము దులిపేసాడు మెగా మేనల్లుడు. మొత్తానికి ఒకే ఏడాది రెండు విజయం అందుకోవడం ఈ హీరోలకు గొప్ప విషయమే.
 

More Related Stories