English   

2020లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..?

jrntr
2019-12-25 20:29:29

రాజమౌళి సినిమాతో ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన తర్వాత సినిమా ఏంటనేది కూడా ఆలోచించలేదు. ఎందుకంటే రాజమౌళి కనీసం ఆలోచించే సమయం కూడా ఇవ్వడు కాబ‌ట్టి. కానీ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కోసం మరోవైపు అన్ని చర్చలు జరుగుతున్నాయి. 2020 లో ఈయన కొత్త సినిమా మొదలు కాబోతుంది. 12 ఏళ్ల కింద ఎన్టీఆర్ తో రాఖీ సినిమా నిర్మించిన కె.ఎల్.నారాయణ ఇప్పుడు మరోసారి ఆయనతో సినిమా నిర్మించబోతున్నాడు. దాదాపు మూడేళ్ల కింద ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నాడు కె.ఎల్.నారాయణ. ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చేలా కనిపిస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత కె.ఎల్.నారాయణ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే సరి కొత్త సంచలనానికి ఆయన తెర తీసినట్లే. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయాలంటే స్టార్ డైరెక్టర్లు మాత్రమే చేయగలరు. కానీ వాళ్లను కాదని ఒక కొత్త దర్శకుడితో కె.ఎల్.నారాయణ సినిమా నిర్మిస్తే మాత్రం అది నిజంగా సాహసమే. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

More Related Stories