English   

2020లో విడుదల కానున్న పెద్ద సినిమాలు ఇవే..

cinema
2020-01-27 19:43:15

2020లో చాలా వరకు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది చిరంజీవి నుంచి రాజమౌళి వరకు అంతా తమ సినిమాలను విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళనాట కూడా భారీ సినిమాలు విడుదల కానున్నాయి. సౌత్‌లో ఈ ఏడాది రాబోయే మోస్ట్ ప్రజ్టేజియస్ ప్రాజెక్టులు ఏంటో ఒక్కసారి చూద్దాం.. అందులో ఉన్న హీరోలెవరో కూడా చెక్ చేద్దాం..

1. మాస్టర్: విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా మాస్టర్. ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్. ఎప్రిల్‌లో మాస్టర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అదరగొడుతుంది.

2. పింక్ రీమేక్: పవన్ కల్యాణ్ రెండేళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా పింక్ రీమేక్. దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలనుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు. కేవలం 25 రోజుల్లోనే పవన్ కల్యాణ్ పార్ట్ పూర్తి చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

3. కెజియఫ్ 2: కన్నడ సినిమాలు అంటే ఇంతకుముందు చిన్నచూపు ఉండేది. కానీ కెజియఫ్ విడుదల తర్వాత అది పోయింది. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కెజియఫ్ 2 ఆగస్ట్ 15న స్వతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నాడు.

4. రజినీకాంత్ 168: రజినీకాంత్ సినిమా ఎప్పుడొచ్చినా కూడా ప్రేక్షకులకు పండగే. ఈ మధ్య కాలంలో ఈయన నుంచి సరైన సినిమా రావడం లేదు కానీ ఈయన మాత్రం వరస సినిమాలు అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు రజినీ. ఈ సినిమా జులై లేదంటే ఆగస్టులో విడుదల కానుంది.

5. అల్లు అర్జున్ 20: అల వైకుంఠపురములో సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లు అర్జున్ ఇదే ఏడాది సుకుమార్ సినిమాతో రానున్నాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా జులైలో విడుదల కానుందని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ చిత్రంలో స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్.

6. చిరంజీవి 152: సైరా నరసింహా రెడ్డి లాంటి పీరియాడికల్ సినిమా తర్వాత కొరటాల శివతో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రం ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది. కొరటాల ఈ సినిమాను కేవలం 99 రోజుల్లోనే పూర్తి చేయబోతున్నాడు.

7. ఆర్ఆర్ఆర్: 2020లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అందరి దృష్టి మాత్రం రాజమౌళి RRR సినిమాపైనే ఉంది. ఈ చిత్రం ముందు చెప్పినట్లు జులై 31న రావడం కష్టమే కానీ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ కూడా 70 శాతం పూర్తైపోయింది. మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు రావడంతో షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమైంది.

8. వలిమై: అజిత్ కుమార్ హీరోగా వినోథ్ తెరకెక్కిస్తున్న సినిమా వలిమై. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అజిత్. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి 2020లో మోస్ట్ ప్రజ్టేజియస్ ప్రాజెక్టులు అయితే ఇవే. మరి ఇవన్నీ అనుకున్న తేదీలకు విడుదలవుతాయా లేదా అనేది చూడాలిక.

More Related Stories