English   

బాలయ్య సినిమాలో కొత్త భామ.. 2020లోనే సినిమా..

nbk
2020-04-15 08:06:30

బోయపాటి శ్రీను ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ ను ఎంజాయ్ చేయడం లేదు. ఇప్పటికే ఏడాదికి పైగా ఈయనకు ఖాళీ టైమ్ దొరికింది. ప్రస్తుతం ఈయన బాలయ్య సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ అయినా కూడా ఇంట్లోనే ఉండి స్క్రిప్ట్ పనులను చేసుకుంటున్నాడు. కథలో మరింత బెటర్ మెంట్ కోసం చూస్తున్నాడు ఈ దర్శకుడు. అసలే నందమూరి బాలకృష్ణతో కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయని బోయపాటికి తెలియంది కాదు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చెప్పిన బోయపాటి.. ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. అందులో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేస్తామని బోయపాటి చెప్పాడు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు బాలయ్య. బోయపాటి సినిమాతో మరో భామ రాబోతుంది. ఇక షూటింగ్ కూడా అక్టోబర్ లోపు పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలిపాడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. డిక్టేటర్ తర్వాత మరోసారి బాలయ్య సినిమాకు పని చేస్తున్నాడు ఈయన.

More Related Stories