English   

2021 సంక్రాంతికి కూడా ఆ ఇద్దరు దర్శకులే..

anil
2020-01-19 18:51:45

2020 సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. ఒకేసారిర రెండు భారీ సినిమాలు రావడం.. ఆ రెండు సంచలన వసూళ్లు తీసుకురావడం నిజంగానే మంచి విషయం. తెలుగు సినిమాకు చాలా రోజుల తర్వాత కళ వచ్చింది కూడా. బన్నీ, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు ఈ సంక్రాంతి చూపించింది. మంచి సినిమాలు వస్తే కచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు అనే దానికి ఈ పండగ మరోసారి నిదర్శనంగా నిలిచింది. ఈ సంక్రాంతికి వచ్చిన స్టార్ సినిమాల వసూళ్లు అదిరిపోయాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండూ రెండే.. వేటికవే కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతున్నాయి. వారం దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ దూకుడు తగ్గడం లేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అల వైకుంఠపురములో అయితే ఎక్కడా జోరు తగ్గించడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాకు కలెక్షన్ల పంట పండుతుంది. ఇక దర్శకులు అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ కూడా ఈ పండక్కి ఫుల్ పండగ చేసుకుంటున్నారు. దాంతో ఇదే ఉత్సాహంలో నెక్ట్స్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు మాటల మాంత్రికుడు..

మరోవైపు ఎఫ్3 సినిమా చేయాలని చూస్తున్నాడు అనిల్. ఈ ఇద్దరూ మరోసారి పండక్కి రాబోతున్నారనే ప్రచారం ఇప్పట్నుంచే జరుగుతుంది. 2021 సంక్రాంతిని కూడా ఇప్పుడే కబ్జా చేస్తున్నారు అనిల్, త్రివిక్రమ్. సరిలేరు సక్సెస్ జోష్ లో అనిల్.. అల వైకుంఠపురములో విజయంలో త్రివిక్రమ్ ప్రస్తుతం ఉన్నారు. ఈ మత్తు వదలడానికి మరికొన్ని రోజులు అయితే పడుతుంది. అయితే ఫిబ్రవరి నుంచి కొత్త సినిమా ఊహలో పడిపోనున్నారు ఈ ఇద్దరు దర్శకులు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరో ఒకరికి కథ చెప్పి ఎప్రిల్ నుంచి సినిమా పట్టాలెక్కించడానికి చూస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరోవైపు అనిల్ రావిపూడి అయితే ఎఫ్3 కి సిద్ధమైపోయాడు. ఈ రెండు సినిమాలు కూడా మళ్లీ సంక్రాంతికి రానున్నాయి. అంటే వచ్చే ఏడాది కూడా ఈ దర్శకులు ఇద్దరూ తమ జోరు చూపించబోతున్నారు. అప్పుడు కూడా మరోసారి బాక్సాఫీస్ దున్నేస్తే తెలుగు సినిమాకు వచ్చే ఏడాది కూడా మంచి ఆరంభం దొరుకుతుంది.

More Related Stories