English   

2023 లో పవన్ కళ్యాణ్ సీఎం.. లెక్కేసి కొడితే..

pk
2020-03-10 20:02:06

లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా కింద ఉండాలి అంటూ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా దగ్గుబాటి చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా లెక్కేసి కొడితే 2023 కు సీఎం కుర్చీ తన కింద ఉండాలి అంటున్నాడు. అయితే అది రియల్ లైఫ్ లో వస్తుందో రాదో తెలియదు కానీ సినిమా లైఫ్ లో మాత్రం వస్తుంది. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో పూరి జగన్నాథ్ సినిమా కూడా ఒకటి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటాడని ఆయన ఇమేజ్ కు సరిపోయే పొలిటికల్ కథ పూరి జగన్నాథ్ సిద్ధం చేశాడని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కథాంశంగా తీసుకుంటున్నాడని.. ఇది ఎన్నికల ప్రచారంగా పనికొస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒకటి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒకటి నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు పవర్ స్టార్. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories