English   

మే 21న సత్యదేవ్ తిమ్మరుసు 

Satya Devs Thimmarusu
2021-04-01 08:25:12

విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడు సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్.ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 21న విడుద‌ల చేస్తున్నారు.ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

‘‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం అని తెలిపారు. అలాగే  సత్యదేవ్‌ పవర్ఫుల్ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని… ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. ఇక డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి  పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

More Related Stories