English   

బ‌స‌వ‌తారకం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి 21 ఏళ్లు..బాల‌య్య ఆస‌క్తిక‌ర పోస్ట్

 Balakrishna
2021-06-23 14:37:58

బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ మరియు రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఇవాళ్టితో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని స్థాపించింది దివంగత నేత మరియు సినిమా హీరో నందమూరి తారక రామారావు గారు. తన భార్య బసవతారకం పేరుమీదుగా అన్న‌గారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఇన్స్టిట్యూట్ 21 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఈ కాన్సర్ హాస్పిటల్ హైదరాబాదులో ఉంది .ఈ హాస్పటల్ లో కేన్సర్ చికిత్స చేసుకున్న చాలామంది క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. 

ఇలా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ గత 11 సంవత్సరాలుగా బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి సంతోషిస్తూ బాలకృష్ణ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాని బాల‌య్య త‌న పోస్ట్ లో... భారతదేశంలోనే అత్యున్నతమైన క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ స్థాపించిన మా నాన్నగారికి కృతజ్ఞతలు. దానికి మా అమ్మ గారి పేరు పెట్టడం నాకు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. ఈ సేవలు ఇలాగే కొనసాగుతాయని క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మా హాస్పిటల్ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. 
 

More Related Stories