English   

లారెన్స్ ట్రస్టులో 21 మందికి కరోనా పాజిటివ్..

raghava
2020-05-28 08:24:23

లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత తనకు చేతనైనంత మందికి సాయం చేస్తూనే ఉన్నాడు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. తను సంపాదించిన దాంట్లో చాలా వరకు ఈయన సాయం చేయడానికే ఖర్చు చేస్తుంటాడు. మొన్నటికి మొన్న 3 కోట్ల విరాళం ఇచ్చి స్టార్ హీరోలను కూడా తల దించుకునేలా చేసాడు లారెన్స్. ఇక ఇప్పుడు చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉన్న ఈయన ట్రస్టులో చాలా మంది చిన్నారులతో పాటు సిబ్బంది కూడా తల దాచుకుంటున్నారు. అక్కడే వాళ్ల బాగోగులు చూసుకుంటున్నాడు లారెన్స్. ఇదిలా ఉంటే చెన్నైలో పెరిగిపోతున్న కరోనా కేసులను కంట్రోల్ చేయడానికి అందరికీ వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే లారెన్స్ ట్రస్టులో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఏకంగా 21 పాజిటివ్ కేసులు బయటికి రావడం సంచలనంగా మారింది. 18 మంది చిన్నారులతో పాటు 3 సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు వైద్యులు. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ వాళ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. వెంటనే అక్కడ ట్రస్టు మూసేసి అందర్నీ క్వారంటైన్ కు తరలించారు.

 

More Related Stories