English   

జార్జ్ రెడ్డికి పవన్ సపోర్ట్... నవంబర్ 22న రిలీజ్ 

 Pawan Kalyan
2019-10-25 09:58:17

టాలీవుడ్‌లో తెరకెక్కిన తాజా బయోపిక్ ‘జార్జ్ రెడ్డి’. యూనివెర్సిటీ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన ఉస్మానియా విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకూ పెద్దగా ఈ సినిమా మీద అంచనాలు లేవు కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 

సినిమా ఎలా ఉంది అనేది రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు కానీ ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచేసింది.  రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా ఈ ట్రైలర్ మెప్పించిందట. ఈ ట్రైలర్ పవన్ కు నచ్చడంతో దర్శకుడు జీవన్ రెడ్డిని పిలిపించుకుని మరీ అభినందించారట. ఒక గొప్ప విద్యార్థి నాయకుడి జీవితంపై సినిమా తీసినందుకు జీవన్ ను మెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాకు అవసరమైతే తాను ముందుంటానని కూడా మాటిచ్చారట. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాల్సిందిగా జార్జ్ రెడ్డి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ని కోరడంతో హాజరవుతానని మాటిచ్చారట. వంగవీటి ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్స్ మీద నిర్మించారు.

More Related Stories