English   

24 కిస్సెస్ ప్రివ్యూ.. ముద్దులే ప్ర‌మోష‌న్.. 

24-Kisses-Preview
2018-11-22 15:32:32

సినిమాలో ఒక్క ముద్దు ఉంటేనే బాబోయ్ అంటున్నారు.. అలాంటిది సినిమా నిండా ముద్దులే ఉంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా..! కానీ ఇప్పుడు హెబ్బాప‌టేల్ మాత్రం ఇదే చేస్తుంది. ఓ సినిమా కోసం ఏకంగా 24 ముద్దులు పెట్టేసింది. ఈ సినిమా పేరు 24 కిస్సెస్. కుమారి 21 ఎఫ్ త‌ర్వాత సీన్ లో క‌నిపించ‌డ‌మే మానేసిన హెబ్బా గురించి చాలా రోజుల త‌ర్వాత ఇండ‌స్ట్రీ మ‌ళ్లీ మాట్లాడుకుంటుంది. దానికి కార‌ణం ఈ ముద్దులే. అస‌లు క‌థ లేకుండా కేవ‌లం ముద్దులు ఉంటే సినిమాలు ఆడేస్తాయా అనేది చిన్న అనుమానం.. కానీ ఇక్క‌డ మాత్రం క‌థ‌తో పాటే ముద్దులు.. క‌థ‌లోనే ముద్దు స‌న్నివేశాలు అంటున్నాడు ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్. ఈయ‌న లాజిక్ న‌చ్చి ఎన్ని ముద్దులు ఇవ్వ‌డానికైనా రెడీ అయిపోయింది హెబ్బాప‌టేల్. అప్పుడెప్పుడో వ‌చ్చిన టీజ‌ర్ లో దాదాపు అర‌డ‌జ‌న్ ముద్దు సీన్లు ఉన్నాయి. 

ఆ త‌ర్వాత ట్రైల‌ర్ లో లెక్క‌పెట్టి మ‌రి 10 ముద్దులు ఇచ్చింది హెబ్బా. పైగా అన్నీ లిప్ లాక్ సీన్సే. ఇక మొన్న విడుద‌లైన మేకింగ్ వీడియోలో అయితే లెక్క కూడా పెట్టాల్సిన ప‌నిలేదు. అవ‌స‌రం అనిపించిన ప్ర‌తీసారి ముద్దులు పెడుతూనే ఉంది హెబ్బాప‌టేల్. 24 కిస్సెస్ అని పేరుకు త‌గ్గ‌ట్లుగానే ఇందులో 24 ముద్దులు ఉన్నాయి. మిణుగురులు లాంటి ప‌ద్ద‌తైన సినిమాతో వ‌స్తే ప్ర‌శంస‌లు మాత్ర‌మే వ‌చ్చాయి.. అందుకే ఈ సారి ఇలాంటి క‌థ‌తో వ‌స్తున్నానంటున్నాడు అయోధ్య కుమార్. ఈ 24 కిస్సెస్ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు. కుమారి 21 త‌ర్వాత ఆ రేంజ్ స‌క్సెస్ లేని హెబ్బాప‌టేల్ ఇప్పుడు త‌న‌కు ఈ చిత్రం ఆ విజ‌యం తీసుకొస్తుంద‌ని న‌మ్ముతుంది. న‌వంబ‌ర్ 23న విడుద‌ల కానుంది ఈ చిత్రం. క‌థ‌తో పాటే ముద్దులుంటే ఓకే కానీ కేవ‌లం ముద్దులే ఉంటే మాత్రం సినిమాను క‌నీసం ప్రేక్ష‌కులు ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో కూడా లేరు. 

More Related Stories