English   

రాగల 24 గంటల్లో ప్రివ్యూ

movie
2019-11-21 19:57:23

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ‘రాగల 24 గంటల్లో’ ఒకటి. సాధారణంగా ఈ పదాన్ని వాతావరణ విశేషాలను తెలియజెప్పేందుకు వాడుతుంటారు. అంటే వచ్చే 24గంటల్లో ఎప్పుడు ఏం జరగబోతోంది? పరిస్థితులు ఎలా మారతాయి? ఎలాంటి అప్రమత్తత పాటించాలి? ఇలా వాతావరణశాఖ వారు ప్రతి విషయాన్ని ప్రజలకి వెల్లడిస్తారు. దీంతో ప్రజలు కూడా జాగ్రత్తతో ఉంటారు. ఇక ‘రాగల 24 గంటల్లో’ అనే సినిమాలో  సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో నటించగా అలనాటి కథానాయకుడు శ్రీరామ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధమరుకం ఫేం శ్రీనివాస్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్ అనే కాక అన్ని బాషల సినిమా ఇండస్ట్రీలో హారర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ల టైమ్ బాగా నడుస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ క్రియేట్ చేయగలిగితే సక్సెస్ పక్కా కావడంతో ఆ తరహాలో మర్డర్ మిస్టరీ జోనర్ తో టాలీవుడ్ లో ఇంతకుముందు చాలా సినిమాలొచ్చాయి.

ఇదే జోనర్ లో ఈ సినిమా రిలీజ్ కి సిద్దమయింది. రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు ఏవి? అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే టీజర్ లో మర్డర్ మిస్టరీని ఇంట్రస్టింగ్ గా చూపించారు. ఈ పాత్రలో ఇషారెబ్బా కరెక్ట్ గా సూటయిందని టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా..నా భర్తను నేనే చంపేశానంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు సినిమా మీద ఆసక్తిని రేకెత్తిమ్చాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలాను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

More Related Stories