English   

దీపిక స్పై ఆపరేషన్ ...24 యాసిడ్ బాటిల్స్ కొని షాకిచ్చింది 

Deepika Padukone
2020-01-16 15:38:46

ప్రేమించు లేకుంటే యాసిడ్ పోస్తా.. ఇది ప్రేమోన్మాదుల నిర్వాకం. అటువంటి యాసిడ్ సామాన్యులకు దొరక్కుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ, యాసిడ్ బహిరంగ మార్కెట్‌లో ఈజీగా దొరుకుంది. అటువంటి మార్కెట్ గుట్టురట్టు చేసింది బాలివుడ్ నటి. స్పై ఆపరేషన్ చేయించి యాసిడ్ ఎంత సులువుగా దొరుకుతుందో..? వెలుగులోకి తెచ్చింది. 

ప్రేమోన్మాదులకు యాసిడ్‌ ఎలా దొరుకుందనేది తెలపడానికి ఓ స్పై ఆపరేషన్ నిర్వహించింది నటి దీపిక పదుకొణె. యాసిడ్ దొరికే కొన్ని షాపులను గుర్తించి అక్కడికి ముందుగా కెమేరాలతో సిద్ధం చేసిన తన సభ్యులను పంపింది. దూరంగా ఓ కారులో కూర్చుని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దీపికా. ఆ స్పై ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సరైన ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదని సుప్రీం కోర్టు నిబంధనలు పెట్టినా ఒక్క ప్రూఫ్ కూడా లేకుండానే ఒక్క రోజులో 24 యాసిడ్ బాటిళ్లను కొనుగోలు చేయవచ్చో ఆ వీడియోలో చెప్పింది దీపికా.

ఆపరేషన్‌ లో భాగంగా ఓ యువకుడు షాప్‌ యజమాని దగ్గరకు వెళ్లి యాసిడ్ కావాలని అడుగుతాడు. ఎందుకు కొంటున్నావనే ప్రశ్న వేయకుండానే యాసిడ్ బాటిల్ ఇచ్చేస్తాడు యజమాని. ఆ యువకుడు పవర్‌ఫుల్ యాసిడ్ ఎలా గంటే మొహం కాలిపోవాలంటూ దబాయించి మరి బాటిల్ కొన్నాడు. యాసిడ్‌ను షాపు ముందే చెకింగ్ కూడా చేశాడా. యువకుడు. బహిరంగ మార్కెట్‌లో యాసిడ్ ఎంత ఈజీగో దొరుకుతుందనే విషయాన్ని దీపికా ఈ ఆపరేషన్ తో కళ్లకు కట్టేలా చూపించింది. 

ఆ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తమ్మీద.. రీల్ లైఫ్‌లోనే కాక, రియల్ లైఫ్‌లో కూడా హీరోయిన్ అనిపించుకుంటున్న దీపికా.  స్పై ఆపరేషన్ చేయించి సమాజంలో మరో అమ్మాయి యాసిడ్ భారిన పడకుండా తన ప్రయత్నం చేసింది. ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల ప్రసంశలు అందుకుంటుంది.

More Related Stories