English   

బాల రామాయణం సినిమాకు 24 ఏళ్లు పూర్తి.. 

 Bala Ramayanam
2020-04-15 14:17:59

జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మనం ఈ పేరు పిలుచుకుంటున్నాం కానీ.. నిజంగానే జూనియర్ గా ఉన్నపుడే సినిమాల్లోకి వచ్చాడు ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు. హీరోగా 1999లో వచ్చాడు కానీ దానికి మూడేళ్ల ముందుగానే 1996 ఏప్రిల్ 14న బాల రామాయణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఈ నందమూరి బాలరాముడు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కింది. అంతేకాదు అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. తాత ఎన్టీఆర్ అంశతోనే రాముడి పాత్రతో తెరంగేట్రం చేశాడంటూ అప్పట్లో నందమూరి అభిమానులు కూడా బుల్లి ఎన్టీఆర్ ను చూసి సంబరపడిపోయారు. ఈ సినిమా విడుదలై సరిగ్గా 24 ఏళ్లు పూర్తైపోయింది.

రాముడి పాత్రకు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుని స్థిరపడిపోయిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ అయితే ఆయన వారసుడిగా వచ్చి మరోసారి రాముడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు జూనియర్ ఎన్టీఆర్. గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పిల్లలందర్నీ ఎంపిక చేసి.. వాళ్లకు శిక్షణ ఇచ్చి.. వాళ్ల అల్లరిని భరించి సినిమా చేసాడు. స్మితా మాధవ్ సీతగా.. స్వాతి బాలినేని రావణుడిగా నటించారు. ఈ సినిమా తర్వాత మూడేళ్లకు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి లాంటి సంచలన విజయాలతో స్టార్ అయ్యాడు జూనియర్. 

More Related Stories