English   

24 గంట‌ల్లో టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన వ‌కీల్ సాబ్

Vakeel Saab trailer
2021-03-30 19:29:23

రీఎంట్రీ తరవాత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. పింక్ సినిమాలో అమితాబ్ చేసిన పాత్రలో పవన్ నటించబోతున్నాడు. సినిమాలో పవన్ లైంగిక వేధింపులు ఎదురుకుంటున్న మహిళల హక్కుల కోసం పోరాటం చేసి వకీల్ సాబ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేసారు. 

ఇక సోమ‌వారం సాయంత్రం 6గంట‌ల‌కు సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇక ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అంతే కాకుండా రిలీజ్ అయిన స‌మ‌యం నుండి రికార్డు బ్రేకింగ్ వ్యూవ్స్ ను సొంతం చేసుకుంటూనే ఉంది. ఇక నిన్న సాయంత్రం విడుద‌లైన ట్రైల‌ర్ కు ఈ రోజు సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు 22 మిలియ‌న్ రియ‌ల్ టైమ్ వ్యూవ్స్ ను సాధించింది. దాంతో టాలీవుడ్ లో 24గంట‌ల్లో ఎక్కువ వ్యూవ్స్ సాధించిన ట్రైల‌ర్ గా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ నిలిచింది. ఇక ఎప్రిల్ 9న థియేట‌ర్ ల‌లో సినిమా విడుద‌ల కానుంది. ఇక సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి. 

More Related Stories