24 కిస్సెస్.. కుమారి ముద్దులే ముద్దులు..!

సినిమాలో ఒక్క ముద్దు ఉంటేనే బాబోయ్ అంటున్నారు.. అలాంటిది సినిమా నిండా ముద్దులే ఉంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా..! కానీ ఇప్పుడు హెబ్బాపటేల్ మాత్రం ఇదే చేయబోతుంది. ఓ సినిమాలో ఏకంగా 24 ముద్దులు పెట్టబోతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులోనే దాదాపు అరడజన్ ముద్దు సీన్లు ఉన్నాయి. పైగా అన్నీ లిప్ లాక్ సీన్సే. హెబ్బాపటేల్, ఆదిత్ అయితే పూర్తిగా లీనమైపోయి ముద్దుల్లో మునిగిపోయారు. 24 కిస్సెస్ అని పేరుకు తగ్గట్లుగానే ఇందులో 24 ముద్దులు ఉండబోతున్నాయి. రావు రమేష్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు. కుమారి 21 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని హెబ్బాపటేల్ ఇప్పుడు తనకు ఈ చిత్రం ఆ విజయం తీసుకొస్తుందని నమ్ముతుంది. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో 24 కిసెస్ సినిమాలో నటిస్తుంది. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది సస్పెన్స్. ఈ టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. సినిమా అంతా ఇదే రేంజ్ లో ఉంటే కుమారి కంటే సంచలనం సృష్టించడం ఖాయం.