English   

విజయ్ సర్కార్ కు 240 కోట్లు సాధ్యమేనా..?

Thalapathy Vijay’s Sarkar Movie Target 240 Crores
2018-11-06 00:56:52

ఒక‌టి రెండు కాదు.. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఏకంగా 240 కోట్లు రావాలి. ఇప్పుడు విజ‌య్ స‌ర్కార్ సినిమాకు రావాల్సిన టార్గెట్ ఇది. అంటే దాదాపు 150 కోట్ల షేర్ రావాలి. అప్పుడు కానీ సినిమా హిట్ అనిపించుకోదు. మెర్స‌ల్ 120 కోట్ల బిజినెస్ చేసి దాదాపు 160 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ న‌మ్మ‌కంతోనే ఈ చిత్రాన్ని 135 కోట్ల‌కు అమ్మారు. అంటే దాదాపు 150 కోట్లు తెస్తే కానీ హిట్ అనిపించుకోదు ఈ చిత్రం. ఇక శాటిలైట్ రైట్స్.. తెలుగు, త‌మిళ‌, కేర‌ళ, ఓవ‌ర్సీస్ అన్నీ క‌లిపితే సినిమా రేంజ్ 200 కోట్ల‌కు చేరిపోయింది. ఇప్పుడు గ్రాస్ 240 కోట్లు వ‌స్తే కానీ స‌ర్కార్ హిట్ జోన్ లోకి రాదు. సినిమా విడుద‌ల అవుతున్న తీరు కూడా అద్భుత‌మే. నాన్ ర‌జినీ మూవీస్ లో ఇదే హైయ్య‌స్ట్. 5 ఖండాలు అంటే స‌రిపోలేదు.. 80 దేశాలు కూడా స‌ర్కార్ ఖాతాలో ఉన్నాయి. దానికితోడు 3500 స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఓ త‌మిళ్ సినిమాకు ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద రిలీజ్. ర‌జినీకాంత్ సినిమాల‌ను సైతం దాటేసింది ఈ చిత్రం ఇప్పుడు.

ఇక తెలుగులో కూడా స‌ర్కార్ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కొన్నేళ్ల కింది వ‌ర‌కు క‌నీస గుర్తింపు కోసం పాకులాడిన విజ‌య్.. ఇప్పుడు ఇక్క‌డ కూడా మార్కెట్ తెచ్చుకున్నాడు. తెలుగు దివాళిని స‌ర్కార్ మాత్ర‌మే కొల్ల‌గొట్ట‌డానికి సిద్ధ‌మైంది. ఈ చిత్ర టీజ‌ర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థ‌మైపోతుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్న ఈ త‌రుణంలో ఓటుహ‌క్కు ప్రాముఖ్య‌త తెలిపేలా ఈ సినిమా క‌థ ఉండ‌బోతుంది. ఇక్క‌డ కూడా దాదాపు 8 కోట్ల బిజినెస్ చేసింది స‌ర్కార్. ఇందులో విజ‌య్ కార్పోరేట్ కింగ్ గా న‌టించాడు. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌చ్చితంగా మెసేజ్ కూడా స్ట్రాంగ్ గానే వెళ్తుంద‌ని భావిస్తున్నారు అభిమానులు. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తోన్న త‌ప్పుల‌ను నిల‌దీసేలా ఈ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తుంది. కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డం.. ఆలోచింప‌జేసే క‌థ ఉండ‌టం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశాలు. మ‌రి చూడాలిక‌.. ఇంత‌టి వైడ్ రిలీజ్ తో స‌ర్కార్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో.

More Related Stories