English   

ముద్దులు లేవు కానీ ఫీల్ ఉంది.. 

24-Kisses
2018-07-08 12:37:04

సినిమాలో ఒక్క ముద్దు ఉంటేనే బాబోయ్ అంటున్నారు.. అలాంటిది సినిమా నిండా ముద్దులే ఉంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా..! కానీ ఇప్పుడు హెబ్బాప‌టేల్ మాత్రం ఇదే చేయ‌బోతుంది. ఓ సినిమాలో ఏకంగా 24 ముద్దులు పెట్ట‌బోతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో ముద్దు పెట్ట‌లేదు కానీ పెట్టే ఫీల్ అయితే తీసుకొచ్చారు. 24 కిస్సెస్ పేరుతో సినిమా చేస్తుంది ఈ కుమారి. ఆదిత్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ర టీజ‌ర్ ను స‌మంత విడుద‌ల చేసింది. కుమారి 21 త‌ర్వాత ఆ రేంజ్ స‌క్సెస్ లేని హెబ్బాప‌టేల్ ఇప్పుడు త‌న‌కు ఈ చిత్రం ఆ విజ‌యం తీసుకొస్తుంద‌ని న‌మ్ముతుంది. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో 24 కిసెస్ సినిమాలో న‌టిస్తుంది. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రంలో 24 ముద్దు సీన్లు ఉంటాయని తెలుస్తుంది. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం గురించి హెబ్బా చెబుతూ.. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ లోనూ త‌న‌ది బోల్డ్ కారెక్ట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ టీజ‌ర్ చూస్తుంటే క్లీన్ సినిమాగా అనిపిస్తుంది కానీ లోప‌ల ఏముందో ఇప్పుడే చెప్ప‌డం మాత్రం క‌ష్ట‌మే. 

More Related Stories