English   

నాని 25వ చిత్రం.. ఏమి ట్విస్ట్ రా బాబు!!

Nani
2019-04-29 12:22:11

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శక‌త్వంలో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ మల్టీ స్టార‌ర్ తెర‌కెక్కుతుంద‌ని ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరిగింది. ఈ సినిమా చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుగుతున్నాయని, ఈ సినిమా ద్వారా నాని మొట్టమొదటి సారి నెగెటివ్ పాత్ర చేయ‌బోతున్నాడని ఆ ప్రచారం సాగింది. ప్రచారం జరిగినట్టే ఆ సినిమాలో తాను ఒక చెడ్డ వ్యక్తి పాత్రను పోషిస్తున్నానని నాని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. నిజానికి ఈరోజు ముందుగా రిలీజయిన సినిమా టైటిల్ అండ్ లోగో మాత్రం ఈ సినిమాలో నాని లేడని అర్ధంవచ్చేలా ఉన్నాయి. నిర్మాతలు ఇచ్చిన అధికారిక ప్రకటన లో సుధీర్ బాబు ఈ సినిమా లో సోలో హీరో కాగా నివేతా థామస్ మరియు అదితి రావ్ హైదరి ఈ చిత్రం లో నాయికలుగా నటించనున్నారని ప్రకటించారు. ముందు నుండీ ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ఖరారైందంటూ ప్రచారం సాగినా.. ఎట్టకేలకు `V` అనే టైటిల్ ని కన్ఫామ్ చేస్తూ చిత్ర యూనిట్ టైటిల్ లోగోని రివీల్ చేసింది. నాని ఈ సినిమాలో లేడనే బ్రమ కల్పించి చివరికి నాని చేతనే ఈ ట్విస్ట్ రివీల్ చేయించింది యూనిట్. దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చనున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

More Related Stories