English   

దాసరి తాత అవుతారట...25 లక్షల విరాళం ఇచ్చిన చిరంజీవి

dasari
2019-05-05 07:52:42

దర్శకరత్న దాసరి నారాయయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు చిరంజీవి మరోమారు తన పెద్దమనసు చాటుకున్నారు. తనను మెగాస్టార్ ని చేసిన సినీ పరిశ్రమ కోసం దర్శకుల సంఘానికి రూ.25 లక్షల విరాళం అందిస్తున్నట్టు చెప్పారు. కొన్ని సంవత్సరాల నుండి దాసరి నారాయణరావు జన్మదినమైన మే 4ను డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి  చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, నటీనటులు, దాదాపు 300 మంది దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఇద్దరి మధ్య దగ్గరి బంధుత్వం ఉందని, ఆ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే దాసరి తనకు తాత అవుతారని చిరంజీవి పేర్కోన్నారు. 

More Related Stories