English   

అమితాబ్‌ ను ఫిదా చేసి....25 లక్షలు గెలిచాడు 

Anmol Shashtri
2020-12-15 16:50:42

కేబీసీ 12వ సీజన్ స్టూడెంట్స్‌ స్పెషల్ లో పాల్గొన్న  గుజరాత్‌కు చెందిన 14 ఏళ్ల అన్‌మోల్‌ శాస్త్రి ఆటకు అమితాబ్  ఫిదా అయ్యాడు. అన్‌మోల్‌ ముక్కుసూటితనానికి, చొరవకి ‘జిగ్యసు’ అని నిక్‌నేమ్‌ పెట్టాడు. ఇక ఈ షోలో అన్‌మోల్‌ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఇక అన్‌మోల్‌ తనకు హౌ ఇట్‌ వర్క్స్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ చానెల్‌ ఉందని బిగ్‌ బీతో చెప్తాడు. దానిలో తాను ఫిజిక్స్‌, బయోలాజికి సంబంధించిన వీడియోలు పొస్ట​ చేస్తానని వెల్లడించాడు. దాంతో అమితాబ్‌ అన్‌మోల్‌ చానెల్‌ లింక్‌ని తనకు షేర్‌ చేయమని.. తన సోషల్‌ మీడియాలో అతడి చానెల్‌ని ప్రమోట్‌ చేస్తానని వెల్లడించాడు. దాని వల్ల అతడి చానెల్‌ని ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారన్నారు బిగ్‌ బీ.  ఏపీజే అబ్దుల్‌ కలాం, స్టీఫెన్‌ హాకింగ్‌ తనకు ఇష్టమైన శాస్త్రవేత్తలని తెలిపాడు. ఇక ఈ షోలో తాను గెలిచే డబ్బుతో ఓ టెలిస్కోప్‌ కొంటానన్నాడు చిన్నారి అన్‌మోల్‌. 

More Related Stories