English   

250 కోట్ల క్ల‌బ్ లో చేరిన స‌ర్కార్.. 

Sarkar
2018-11-28 16:15:25

స‌ర్కార్ విడుద‌లైన రోజు టాక్ చూస్తే ఈ సినిమా క‌నీసం సేఫ్ అవుతుందా..? త‌మిళ‌నాట అంటే ఎలాగోలా విజ‌య్ ఉన్నాడు కాబ‌ట్టి ఓపెనింగ్స్ వ‌స్తాయి కానీ సినిమా నిల‌బ‌డుతుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ నాలుగు రోజుల పోయిన త‌ర్వాత అన్నీ పటాపంచ‌లు అయిపోయాయి. కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల్లో 150 కోట్లు వ‌సూలు చేసిందంటే ఈ చిత్రం ప్ర‌భంజ‌నం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత కూడా సినిమా ఎక్క‌డా జోరు త‌గ్గించ‌లేదు. తెలుగులో అయితే విజ‌య్ కు మార్కెట్ లేదు అంటూనే యావ‌రేజ్ టాక్ తో 9 కోట్లు షేర్ తీసుకొచ్చింది. క‌నీసం సేఫ్ అవుతుందా అనే లెక్క‌ల నుంచి లాభాలు తీసుకొచ్చింది స‌ర్కార్. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రం దూకుడు ముందు చాలా రికార్డులు మొక‌రిల్లాయి. దానికి కార‌ణం త‌మిళ్ స‌ర్కార్ అన్నాడిఎంకేనే. వాళ్లు కానీ వివాదం రేప‌క‌పోయి ఉండుంటే స‌ర్కార్ నిజంగానే యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయుండేది. కానీ వాళ్లు నిప్పు అంటించారు.. దెబ్బ‌కు స‌ర్కార్ క‌లెక్ష‌న్లు మంట మండాయి. 

ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నైలో 15 కోట్ల మార్క్ అందుకుంది స‌ర్కార్. బాహుబ‌లి 2 కాకుండా ఆ రికార్డ్ అందుకుంది ఒక్క స‌ర్కార్ మాత్ర‌మే. 20 రోజుల్లో 252 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. షేర్ 150 కోట్ల‌కు పైగానే ఉంది. స్పైడ‌ర్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మురుగ‌దాస్ కు కూడా ఈ చిత్ర విజ‌యం కీల‌కంగా మారింది. ఇప్పుడు అందుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదే కాన్ఫిడెన్స్ తో ర‌జినీకాంత్ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇక విజ‌య్ అయితే గ‌తేడాది అదిరిందితో 250 కోట్ల మార్క్ అందుకున్నాడు ఇప్పుడు మ‌రోసారి అదే ఫీట్ చేసి చూపించాడు. మొత్తానికి స‌ర్కార్ దూకుడు ముందు చాలా సినిమాల రికార్డులు త‌ల‌కిందులు అయిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండస్ట్రీలో కేవ‌లం ఆరు సినిమాలు మాత్ర‌మే 250 కోట్ల మార్క్ అందుకున్నాయి. అందులో విజ‌య్ స‌ర్కార్, మెర్స‌ల్ ఉండ‌గా.. ప్ర‌భాస్ బాహుబ‌లి 1,2.. ర‌జినీకాంత్ క‌బాలి, రోబో సినిమాలు ఉన్నాయి

More Related Stories