English   

బాలనటుడు హీరోగా సినిమా....26న విడుదల !

 Diksoochi
2019-04-23 09:05:28

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1993లో వచ్చిన సూపర్ హిట్ సినిమా నెంబర్ వన్ తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన బాలనటుడు దిలీప్‌ కుమార్ సల్వాది. బాలనటుడిగా సుమారు 30 సినిమాల్లో నటించాడు. ఆ తరవాత హీరోగా మారి నాలుగు సినిమాలు చేశాడు. చిత్రసీమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ నటుడు ‘దిక్సూచి’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ దర్శక హీరో తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు ‘చిత్రసేన’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

More Related Stories